కరోనా వైరస్ మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రధాని మోడీ ధర్డ్‌వేవ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాపై ఆంక్షలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, మందుల పంపిణీ, ముందస్తు నిల్వలు వంటి కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని, కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పించాలని ఆదేశించారు. ఉద్యోగులు ఉంటున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్ నుంచి తొలగించాకే ఆఫీసుకు రావాలని సూచించారు. అంతేకాకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్షలో చర్చించారు. ఈ నేపథ్యంలో రేపు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులకు థర్డ్‌వేవ్‌పై పలు కీలక సూచనలు చేయనున్నారు.