తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ భూములను వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్లో రాజీవ్ స్వగృహ భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కార్ లబ్ధిదారుల నుంచి తీసుకున్న డిపాజిట్ నుంచి 2 కోట్లతో రైతుల నుంచి 67 ఎకరాలు సేకరించిందని, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కలెక్టర్ అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు వివాదాలున్నా .. […]
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో వెనుక పడ్డామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. అగ్నిపథ్ అంటే మిలిటరీ ఉద్యోగం నాలుగేళ్లు చేయాలంట అంటూ ఆయన మండిపడ్డారు. యువతను బీజేపీని మోసం చేస్తుందని, ఓ కేంద్ర మంత్రి అంటారు కటింగ్ చేయడం నేర్పిస్తా… బట్టలు ఇస్త్రీ చేయడం నేర్పిస్తా […]
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభనష్టాల్లో మధ్య తీవ్ర ఊగిలాడాయి. అయితే చివరికి లాభాల్లోని ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గ్లోబల్ చమురు ధరల పతనంతో ఆయిల్ రంగ షేర్లన్నీ పడిపోయాయి. దీంతో భారీ నష్టాల్లోకి కీలక సూచీలు జారుకున్నాయి. కానీ చివరి అర్థగంటలో భారీగా ఎగబాకాయి. అయితే.. ఒక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 51598 వద్ద, నిఫ్టీ 57 […]
హైదరాబాద్ అంటే ఓ ట్రాఫిక్ సముద్రం. ఈ సముద్రంలో ఈదుతూ ఆఫీస్ నుంచి ఇంటికో.. లేక కాలేజ్, స్కూల్ ఇలా ఎక్కడి నుంచైనా ఇంటికి వెళ్లేసరికి ఉన్న ఉత్సాహం కాస్తా ఆవిరైపోతుటుంది. కానీ ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం గ్రేటర్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మెట్రో ప్రారంభమైననాటి నుంచి ఆయా ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య తీరినట్లు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో ఫ్లైఓవర్ గ్రేటర్వాసుల ట్రాఫిక్ కష్టాలను […]
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజవర్గంలోని ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మంజీరా నీళ్లు తెచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసినమని, నియోజకవర్గంలో ఉండి సేవ చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండేవారని, ఈ నీళ్లు చూస్తే స్వర్గీయ మాణిక్ రెడ్డి […]
బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు రోజులుగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బాసర విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో.. బాసర ఐఐఐటీ విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ ఆందోళన చేస్తున్నారని, వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మరో వైపు మీ పుత్ర […]
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరి సవాల్లు విసురుకుంటున్నారు. అయితే తాజాగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు అవాస్తవాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా లో క్రాప్ హాలిడే ప్రకటించారు అనడం బాధాకరమని, 40-45 వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో వరి సాగు చేస్తున్నారని, 15,800 […]
ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. నిన్నరాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికారులు అక్రమంగా గోడను కూల్చివేశారని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్, నీలంపేట […]
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ చీకటి దాడులు చేసిందంటూ ఆయన మండిపడ్డారు. అయ్యన్న ఇంటి గోడ అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపేనని ఆయన ఆరోపించారు. టీడీపీలో బలమైన బీసీ నేతలని […]
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలని, బీసీలు గళమెత్తకుండా చేసేందుకు జేసీబీలతో వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలోని బీసీలను అణచి వేయడమే ధ్యేయంగా జగన్ పని చేస్తున్నారని, […]