నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు లబ్దిపొందేందుకు అందరూ హక్కు దారులన్నారు. దళితులకు లబ్ది చేకూరలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఆలోచించి దళిత బంధు పథకం ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వ్యవసాయ రంగం మీద ఆధారపడి రైతులు జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో భూమిలేని వారు దళితులు ఎక్కువగా ఉన్నారన్నా మంత్రి నిరంజన్ రెడ్డి.. దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు.
మన రాష్ట్రంలో నాలుగు మండలాల్లో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టులో చారకొండ మండలం ఒకటి అని ఆయన వెల్లడించారు. చారకొండ మండలంలో 1,707 కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అవలంబిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.