కరెంట్ బిల్లు పేరుతో లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన హైదరాద్‌లో చోటు చేసుకుంది. మెహిదీపట్నంకి చెందిన వ్యక్తి ఫోన్ కి కరెంట్ బిల్లు కట్టాలని, కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. అయితే దీంతో ఖంగుతిన్న అతను అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుకి ఆ మెసేజ్ చూపగా, అది నిజమేనేమో అనుకున్న అతని కొడుకు మెసేజ్ వచ్చిన ఫోన్ కి ఫోన్ చేశాడు. దీంతో కేటుగాళ్లు […]
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టుబడింది. విదేశీ ప్రయాణీకుల వద్ద 10 కోట్ల విలువ చేసే 21.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుండి ముంబాయి వచ్చిన 16 మంది విదేశీ ప్రయాణీకులు వద్ద ఈ బంగారం దొరికింది. అయితే.. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానం దిగగానే కస్టమ్స్ అధికారులతో గొడవకు […]
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ట్వట్టర్ వేదికగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలనను సాగిస్తోందని, రాష్ట్రంలో ఏ పథకాన్నీ సరిగ్గా అమలు చేయడం లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు… ప్రతి దానిలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి కోత పెట్టిన రాష్ట్ర సర్కారు… రూపాయికి కిలో బియ్యం కూడా సక్కగ ఇస్తలేదు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు […]
గతేడాది రిపబ్లిక్ మూవీతో మంచి హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసిందే. దాంతో కోలుకోవడానికి సాయికి చాలా సమయం పట్టింది. ఇక అంతా సెట్ అయ్యాక.. తిరిగి సినిమా సెట్లోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్. ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే SDT15 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌లో కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. […]
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో.. సూర్య గెస్ట్ రోల్ పోషించిన ‘విక్రమ్’ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపింది. కెజీయఫ్ చాప్టర్ 2 తర్వాత.. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత కమల్‌కి పెద్ద హిట్ రావడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దాంతో ఈ సినిమాకి పని చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్, పార్టీలు ఇస్తూ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందులో ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో ఉండగా.. ఇప్పుడు చెర్రీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఇంతకీ చరణ్ ఏ హీరో కోసం గెస్ట్‌గా మారనున్నాడు.. బాలీవుడ్ ప్లాన్ నిజమేనా..! గతంలో ఓ సారి బాలీవుడ్లో సినిమా చేసి.. […]
ప్రధాని మోడీ జులై 3వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే మోడీకి తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో జనసమీకరణ చేసి ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ ఉపధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… […]
ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అయితే.. తాజాగా.. సికింద్రాబాద్ కాల్పులను మావోయిస్టు పార్టీ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. అగ్నిపథ్ పథకాన్ని రద్ధు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని లేఖలో […]
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టని అగ్నిపథ్ పథకంపై విమర్శులు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు జరుగుతున్నాయని, అయిన కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరమన్నారు. నిరుద్యోగ యువత అంటేనే బీజేపీ నాయకులు చిన్నచూపు చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష, 40 వేలు ఉద్యోగాలు ఇచ్చిందని, 2 […]
ఇటీవల కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీకి అందింది.. అయితే.. సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం లో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి నిందితుడితో పాటు A13 నుండి A56 వరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు […]