ఐటీసీ కోహినూర్ పబ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. రాయదుర్గం పీఎస్కు బాధిత యువతి, విష్ణు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడిందని విష్ణు పేర్కొంది. నేను ఇద్దరం స్నేహితులం కలిసి బార్ అండ్ పబ్ కు వెళ్ళామని, అక్కడ మాతో పాటు ఉన్న అమ్మాయి మ్యూచ్వల్ ఫ్రెండ్ తన స్నేహితులతో వచ్చారని తెలిపింది. కొద్దిసేపటి తరువాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని, అడ్డుకునేందుకు నేను నా ఫ్రెండ్ ప్రయత్నించామని విష్ణు […]
మొన్నటికి మొన్న అమ్నిషియా పబ్ రేప్ కేసు ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. 14ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. వివరాలిలా.. పాతబస్తీకి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 14 ఏండ్ల బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవ పడి బయటకు వచ్చింది. 2 కిలోమీటర్ల దూరంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోలోని నలుగురు […]
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అయితే ఆలస్యంగా తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు విస్తరించడంలో కూడా మందగిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటు హైదరాబాద్లోని నార్త్, వెస్ట్ ఏరియాల్లో నేటి రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. […]
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతి సారి అధికార పార్టీదే పై చేయి ఉంటున్న నేపథ్యంలో తాజాగా విపక్షాలు కూటమి అధికార పార్టీకి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయిన విపక్షాల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో […]
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలోని అనంతగిరి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన సుపరిపాలన ప్రతి గడపను.. ప్రతి గుండెను తాకిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన మంచి మనసుతో ఆలోచించి అద్భుతమైన పథకాలు అమలు చేసి చూపించారని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు ఇలా ఎన్నో పథకాలు వైఎస్సార్ ను ప్రజలు […]
భారతదేశంలో చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన, ఆకట్టుకునే రాబడిని అందించే పథకాల కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంచుకోవడానికి అనేక పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి ఎంపికలు చాలా అస్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఎస్బీఐ అందించే అటువంటి పెట్టుబడి పథకమే ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. […]
టెక్నాలజీ రోజూ కొత్త పుంతలు తొక్కుతూ మానవుడి జీవినశైలిలో భాగమైపోయింది. ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూనే ఉంది. టెక్నాలజీ రంగంలో అర్థమయ్యికానీ.. కొన్ని విషయాల్లో క్రిప్టో కరెన్సీ ఒకటి. అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టి కోట్ల ఘడించాలనుకొని బొక్కబోర్లా పడుతున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించాలని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోసపోతున్నారు. అయితే అందులో భారతీయులు కూడా ఉన్నారు. అయితే నకిలీ క్రిప్టోకరెన్సీ ఎక్చేంజీలు ద్వారా భారతీయ పెట్టుబడిదారులు సుమారు 128 […]
రోజు రోజుకు మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే.. స్త్రీలపై చేసిన అఘాయిత్యాలు బయటకు రాకుండా హత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా మృతదేహాలను దొరకకుండా ఉండేందుకు వివిధ మార్గాల్లో శవాలను మాయం చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే తాజాగా మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లి గ్రామ శివారులో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. మహిళను హత్య చేసి […]
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులు మరో పోరాటంకి సిద్దం అవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దం అవ్వండని, పొడు భూములకు పట్టాలు ఇస్తారు అని నమ్మినము.. కానీ మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది.. భూములు పంచింది కాంగ్రెస్సే అని ఆయన వెల్లడించారు. మిగిలి ఉన్న భూములకు కూడా పట్టాలు కాంగ్రెస్ ఇస్తుందని […]