1. నేడు భారత్- సౌతాఫ్రికా పైనల్ టీ20 మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న ఇరు జట్లు. 2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.66,300లుగా ఉంది. 3. నేడు తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను బీజేపీ […]
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసగించారు. పల్లెలో నర్సరీ, రైతు వేదికలు, ఇంటింటికీ నల్లా, ట్రాక్టర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కరెంటు సమస్య తీరింది, 24గంటలు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనేనని ఆయన వెల్లడించారు. కృష్ణా నీటి వాటాను కేంద్రం తేల్చలేదని, నార్లాపూర్, ఏదుల, కర్వెన, ఉధండాపూర్ ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం చేస్తామని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్రూం,పింఛన్లు, […]
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె మాట్లాడుతూ.. మహిళల మాన ప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరు బాగుపడలేదని, ప్రజలు అప్పుల పాలు అయ్యారు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణగా మార్చారంటూ […]
తెలంగాణలో మరోసారి కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజు కరోనా కేసులు పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగించే విషయం. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 24,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణైంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నిన్న 172 కేసులు వెలుగుచూడగా నేడు హైదరాబాద్ లో 157 కొత్త కేసులు వెలుగు చూసాయి. అదే సమయంలో ఒక్కరోజు […]
అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలి అంటూ ఉద్యమం మొదలైందే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు కొనసాగింపే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు అని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని యువత గుర్తించినందునే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు. ఈ మేరకు శనివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకు పరాకాష్టే బీహార్,సికింద్రాబాద్ ఉదంతాలు అని ఆయన […]
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రేపు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకువచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవిమానపరిస్తూ సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లాగా చేస్తోందని ఆయన మండిపడ్డారు. యువతను నిర్వీర్యం […]
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేసిందని, ఇప్పడు కేసీఆర్ చేష్టలతో కాంగ్రెస్ […]
నిన్న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చెప్పాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఆర్మీ అభ్యర్థి మహేందర్ మేనమామ మాట్లాడుతూ.. 5ఏళ్ల నుంచి మహేందర్ ఆర్మీలో జాబ్ కొట్టాలని తీవ్ర […]
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే.. జూన్ 27 నుండి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 11 కాగా.. ఆగస్ట్ 14న ఉదయం 10.30 నుండి […]
ట్రాఫిక్ పోలీసు విధులు అనుకున్నంత సులువు కాదన్నది జగమెరిగిన సత్యం. ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఎండనక, వాననక విధులు నిర్వర్తిచాల్సి ఉంటుంది. కానీ, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి ముందుకు వెళుతుంటారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిచడమే కాకుండా.. రోడ్డుపై అవస్థలు పడుతున్న వారికి సహాయం చేసిన ఘటనలు వైరల్ అయ్యాయి. అయితే.. అలాంటి సంఘటన […]