ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ సోమవారం తన డెలివరీ భాగస్వామి బిల్లేసి (Billeasy) తో కలిసి వాట్సాప్ ద్వారా ఈ-టికెటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. బిల్లేసి భారతదేశపు అత్యంత విజయవంతమైన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్. గత కొన్ని నెలలుగా అనేక ట్రయల్స్ తర్వాత, హైదరాబాద్ మెట్రో రైల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం బిల్లేసి మరియు ఏఎఫ్‌సీ (ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్) భాగస్వామి, షెల్‌ఇన్ఫో గ్లోబల్‌ఎస్‌సీ సింగపూర్‌తో కలిసి వాట్సప్ ద్వారా డిజిటల్ టిక్కెట్ బుకింగ్ కొత్త మోడ్‌ను ప్రారంభించింది. ఈ సరికొత్త సర్వీస్ హైదరాబాద్ మెట్రో రైల్‌లో నిత్యం ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణీకులు ఇప్పుడు తమ సొంత వాట్సాప్ నంబర్‌లో ఈ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రయాణంలో కొనసాగడానికి ఏఎఫ్‌సీ గేట్ల వద్ద ఏర్పాటు చేస్తారు. అయితే.. ఈ టిక్కెట్‌ను TSavaariతో పాటు ఇతర థర్డ్ పార్టీ యూపీఐ చెల్లింపుల ద్వారా బుక్ చేసుకోవచ్చు. తాజా పరిణామానికి సంబంధించి ఎల్‌అండ్‌టి ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండి అండ్ సీఈవో కేవీబీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “హైదరాబాద్ మెట్రో రైలు డిజిటలైజేషన్ శక్తిని విశ్వసిస్తోంది. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా, మా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, మా సేవా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి పూర్తి డిజిటల్ చెల్లింపు గేట్‌వేతో భారతదేశపు మొట్టమొదటి మెట్రో వాట్సాప్ ఈ-టికెటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. అయితే.. ఈ టిక్కెట్‌ను ఎలాం బుక్ చేసుకోవాలో క్రింద విశ్లేషించాం.