భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రభా శంకర్ కిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరగటంతో పలువురు గాయపడ్డారు. భద్రాచలంలోని ప్రభ శంకర్ కిమ్స్ హాస్పిటల్ లో ఈరోజు సాయంత్రం సి టీ స్కానర్ గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు రావడంతో అందులో చికిత్స పొందుతున్న పేషంట్లని బయటకు తీసుకొని వచ్చారు. ప్రైవేటు ఆసుపత్రిలోకి తరలించారు. గదిలో మంటలు రావడంతో హాస్పిటల్లో పోగలు అలుముకున్నాయి.
దీంతో పలువురు అస్వస్థకు గురయ్యారు. వారిని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే.. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.