ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి.. ఈ మోసాలు పలురకాలు.. కొంతమంది బ్యాంకు వివరాలను మాయమాటలు చెప్పి తెలుసుకొని కొట్టేస్తుంటే.. ఇంకొంతమంది మ్యాట్రిమోని పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు. మరికొంతమంది డబ్బుతో పాటు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి తనకు తాను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి నలుగురు యువతులను మోసం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెల్గాంకు కుంపాత్‌గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి మ్యాట్రిమోనీలో వధువు కావలెను […]
ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇటీవల సవరించిన జీవోతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల మనుగడకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నది వాస్తవం. ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడ కష్టమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం తగ్గి తద్వారా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు […]
‘రాజా వారు-రాణీగారు’, ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల ‘మత్తు వదలరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ), […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తకాదు.. నిత్యం ఆమె వివాదాలతోనే సహజీవనం చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ పెళ్లిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో ఫైర్ బ్రాండ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అభిమానులు తెగ సంతోషించారు. అయితే ఆ ఆనందం మూడునాళ్ళ ముచ్చటే అన్నట్లు ఉంది. తాజాగా కంగా ఇన్స్టాగ్రామ్ […]
ఒక సినిమా తీసేటప్పుడు హీరోలు ఎంత కష్టపడతారో బయట సినిమా చూసేవారికి ఎవరికి తెలియదు.. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సైతం ఒక సినిమా కోసం బాడీ పెంచడానికి హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ మృతి చెందారు. పాత్రను రియల్ గా చూపించడానికి దర్శకులు, హీరోలు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో హీరోలకు దెబ్బలు తగలడం సహజం.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గాయపడినట్లు చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం షాహిద్ […]
సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నో ఎంట్రీ’ సినిమా ఒకటి. సల్మాన్ తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ మల్టీస్టారర్ 2005లో బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న […]
బిగ్ బాస్ 5 సీజన్ ముగింపుకు వస్తుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. విన్నర్ కాండిడేట్ అంటూ ప్రచారం జరిగిన యాంకర్ రవి 12వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ కావటంతో అది మరింత ఆసక్తికరంగా మారింది. అసలు రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటూ అతడి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులోకి రాజకీయ శక్తులు కూడా ఎంటర్ అవటానికి ట్రై చేస్తున్నాయి. బిజెపి ఎమ్మెల్లే, తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. ఇంకో […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో పలు ప్రాజెక్టులు చేస్తున్న అమ్మడు తాజాగా హాలీవుడ్ కి కూడా పయనమైన సంగతి తెలిసిందే. ‘ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్‘ చిత్రంతో సామ్ హాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆఫర్ వచ్చినప్పటినుంచి.. సామ్ వెనుక ఉన్న […]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే చర్చ. ఎప్పుడైతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడానికి గల కారణం ఏంటి..? బాలయ్య బాబు- అల్లు అరవింద్ ల మధ్య బంధమా..? లేక పుష్ప ప్రమోషన్స్ కోసమా అని అందరు రకరకాలుగా ఊహించేసుకున్నారు. ఇక తాజాగా […]
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా […]