న్యూ ఇయర్ లో జాబ్ కొట్టాలనే కసితో సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలు ఐసోలేటెడ్ కేటగిరీ కింద మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు పోస్టును బట్టి 12వ తరగతి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు పోస్టును బట్టి 30/32/33/35/40 సంవత్సరాలు. వయస్సు జనవరి 1, 2026 నాటికి లెక్కిస్తారు. SC/ST/OBCలకు నియమాల ప్రకారం సడలింపు ఉంటుంది. సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్ (ట్రాన్స్‌లేషన్ టెస్ట్ లేదా ఇతర స్కిల్స్, పోస్ట్‌ను బట్టి), డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ rrbapply.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 29, ఫీజులు సమర్పించడానికి చివరి తేదీ జనవరి 31, 2026. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.