PM Modi: గత పదేళ్లలో ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) ఆధ్వర్యంలో పనిచేసిన వ్యవస్థ ద్వారా రూ. 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తాజాగా ప్రగతి 50వ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని.. కార్యక్రమానికి సంబంధించిన తీసుకోవాల్సి చర్యల గురించి చర్చించారు. దేశంలో చేపడుతున్న సంస్కరణల వేగం పెరుగుదల, ప్రాజెక్టులు సమయానికి పూర్తవ్వాలంటే ప్రగతి ఎంతో అవసరం అని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
READ MORE: Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..
ప్రగతి ఆవిర్భావాన్ని గుర్తు చేస్తూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వాగత్ (SWAGAT) అనే సాంకేతిక వేదికను ప్రారంభించినట్టు ప్రధాని చెప్పారు. అదే అనుభవంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, పెద్ద ప్రాజెక్టులు, ముఖ్యమైన పథకాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రగతిని దేశవ్యాప్తంగా తీసుకువచ్చామని తెలిపారు. గత పదేళ్లలో ప్రగతి ఆధారిత వ్యవస్థ ద్వారా రూ. 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రగతిలో 377 ప్రాజెక్టులను సమీక్షించామని.. 3,162 సమస్యలను గుర్తించామన్నారు. ఇందులో 2,958 (సుమారు 94 శాతం) పరిష్కారమయ్యాయని తెలిపారు. దీనివల్ల ఆలస్యం, ఖర్చుల పెరుగుదల, సమన్వయ లోపాలు గణనీయంగా తగ్గాయని అన్నారు.
READ MORE: Peddireddy Ramachandra Reddy: జగన్ మళ్లీ సీఎం అయితేనే ఆ నిజానిజాలు బయటకు వస్తాయి..
ప్రగతి సహకార ఫెడరలిజానికి మంచి ఉదాహరణ అని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచి సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సామాజిక రంగంలోనూ ప్రగతి తరహా విధానాలను రాష్ట్రాలు అమలు చేయాలని, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఇలాంటి వ్యవస్థలను సంస్థాగతంగా రూపొందించాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. రహదారులు, రైల్వేలు, విద్యుత్, జలవనరులు, బొగ్గు రంగాలకు సంబంధించిన ఐదు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని సమీక్షించారు. ఇవి ఐదు రాష్ట్రాలకు సంబంధించి రూ. 40 వేల కోట్లకు పైగా వ్యయంతో రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. అలాగే, పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేయాలని ప్రధాని సూచించారు. పీఎం శ్రీ పాఠశాలల పథకం దేశవ్యాప్తంగా సమగ్ర విద్యకు ఆదర్శంగా మారాలని ప్రధాని తెలిపారు. కేవలం భవనాలకే పరిమితం కాకుండా, ఫలితాలపై దృష్టి పెట్టాలన్నారు.