బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తకాదు.. నిత్యం ఆమె వివాదాలతోనే సహజీవనం చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ పెళ్లిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో ఫైర్ బ్రాండ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అభిమానులు తెగ సంతోషించారు. అయితే ఆ ఆనందం మూడునాళ్ళ ముచ్చటే అన్నట్లు ఉంది.
తాజాగా కంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక బ్రేకప్ కోట్ ని పోస్ట్ చేసింది. ” నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను.. కానీ, నువ్వు నన్ను మోసం చేశావు” అనే అర్ధం వచ్చేలా హిందీలో తన మనోభావాలను రాసుకొచ్చింది. దీంతో అమ్మడికి బ్రేకప్ అయినట్లు అర్ధవవుతుంది. ఇటీవలే ఆమె నాకు తల్లి కావాలనుంది .. త్వరలోనే నా ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమైన విషయం. మరి ఈ విషయమై కంగనా ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.