బిగ్ బాస్ 5 సీజన్ ముగింపుకు వస్తుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. విన్నర్ కాండిడేట్ అంటూ ప్రచారం జరిగిన యాంకర్ రవి 12వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ కావటంతో అది మరింత ఆసక్తికరంగా మారింది. అసలు రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటూ అతడి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులోకి రాజకీయ శక్తులు కూడా ఎంటర్ అవటానికి ట్రై చేస్తున్నాయి. బిజెపి ఎమ్మెల్లే, తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రాంతీయవాదం కూడా తీసుకు వచ్చారు. తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోంది అంటూ. ఈ నేపథ్యంలో అసలు రవికి నిజంగానే ఓట్లు తక్కువ వచ్చాయా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్.
అయితే నిర్వాహకుల అంతరంగిక సమాచారం మేరకు నిజంగానే రవికి ఓట్లు తక్కువగా వచ్చాయట.
ఎందుకనేది పక్కన పెడితే రవితో ఎలిమినేషన్ విషయంలో పోటీపడ్డ ప్రియాంకకు శుక్ర, శనివారాల్లో భారీస్థాయిలో ఓట్లు పోలయ్యాయట. దీంతో దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో రవి ఎలిమిషన్ తప్పనిసరి అయిందట. నిర్వాహకులు ఓటింగ్ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని చెబుతున్నారు. ఇక కాజల్ కి రవి, ప్రియాంక కంటే ఎక్కువ ఓట్లు సభించినట్లు సమాచారం. అయితే ఇలా ఫాలోయింగ్ ఉన్న కాండిడేట్ ఎలిమినేషన్ జరిగినప్పుడు ఓట్ల లెక్కలు బహిర్గతం చేయాలనే డిమాండ్ రావటం సహజం. అయితే ఎలిమినేషన్ సమయంలో ఆ వారం ఎలిమినేషన్ లో ఉన్న పోటీదారుల ఓటింగ్ వివరాలను ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే బహిర్గతం చేసిన పక్షంలో ఇలాంటి కామెంట్స్ రాకుండా ఉంటాయన్నది వాస్తవం. అప్పుడు వీక్ కంటెస్టెంట్లను ఉంచి స్ట్రాంగ్ అయిన పోటీదారులను బయటికి పంపిస్తున్నారనే ఆరోపణలు ఏవీ రావు. ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు దృష్టి సారిస్తారేమే చూద్దాం