ఒక సినిమా తీసేటప్పుడు హీరోలు ఎంత కష్టపడతారో బయట సినిమా చూసేవారికి ఎవరికి తెలియదు.. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సైతం ఒక సినిమా కోసం బాడీ పెంచడానికి హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ మృతి చెందారు. పాత్రను రియల్ గా చూపించడానికి దర్శకులు, హీరోలు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో హీరోలకు దెబ్బలు తగలడం సహజం.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గాయపడినట్లు చెప్పుకోచ్చాడు.
ప్రస్తుతం షాహిద్ జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగులో నాని ఎంత కష్టపడ్డాడో.. షాహిద్ కూడా క్రికెట్ నేర్చుకొని అంతే కష్టపడ్డాడు. ఇక తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో క్రికెట్ రిహార్సల్స్ చేసేటప్పుడు గాయపడినట్లు చెప్పుకొచ్చాడు. ” క్రికెట్ సాధన చేస్తున్నప్పుడు బౌలర్ వేసిన బంతి పెదవికి బలంగా తాకింది. దీంతో పెదవంత రక్తంతో తడిసిపోయింది.. హాస్పిటల్ కి వెళ్తే 25 కుట్లు వేశారు.. జీవితంలో పెదవి తెరవలేను అనుకున్నాను.. ఈ గాయం వలన దాదాపు 2 నెలలు షూటింగ్ ఆపేశారు.. అని చెప్పకొచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రం కాబట్టి కొద్దిగా రిస్క్ చేయక తప్పదు.. మరి ఈ చిత్రంతో షాహిద్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.