నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఇక ఈ వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ” జై బాలయ్య అని అభిమానులు ఇప్పుడు అంటున్నారు కానీ నేను ఎప్పుడు అనుకుంటాను. ఈ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్ కి, రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక మంచి సినిమాను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో నాకు ఐడియా ఉంది .. దానికి ఉదాహరణ సింహ, లెజెండ్, ఇప్పుడు అఖండ.. ఈ సినిమాకు సంబంధించి ఒక హామీ ఇస్తున్నాను.. ప్రేక్షకులందరూ హ్యాపీగా సినిమాకు వెళ్లి గుండెల మీద చేయి వేసుకొని కాలర్ ఎత్తుకొని బయటికి వచ్చే సినిమా అని చెప్తున్నాను.. బాలయ్య గురించి మాట్లాడాలంటే.. ఆయన గురించి నేను చెప్పలేను.. ఆయన ఎనర్జీ మీరు సినిమాలో చూడండి.
ఇక ఆయన చేతికి సర్జరీ కావడానికి కారణం కూడా నేనే.. జై బాలయ్య సాంగ్ షూట్ చేసేటప్పుడు దానికి రిహార్సల్స్ చేసేటప్పుడు కాలు జారీ ఆయన కిందపడేటప్పుడు ఎడమ భుజంతో ఆపేశారు. నెక్స్ట్ డే ఆ విషయం తెలిసి నా గుండె ఆగింది. దీంతో ఆ సాంగ్ షూట్ ఆపేద్దామని నేను చెప్పాను. ఆయన మాత్రం పర్లేదు చేసేద్దామని చెప్పారు. అలా ఉన్నప్పుడు వచ్చిన సాంగ్ జై బాలయ్య.. అది బాలయ్య అంటే.. మాస్ అభిమానుల కోసం, మాస్ సాంగ్స్ లేకపోతె ఎలా అన్నారు. అది అభిమానులపై బాలయ్య బాబుకు ఉన్న ప్రేమ.. నేను డైరెక్టర్ గా కావడానికి హెల్ప్ చేసింది బన్నీ అయితే నేను ఈరోజు ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య.. వీరిద్దరూ ఒకే స్టేజిపై ఉన్నప్పుడూ నేను మాట్లాడం ఎంతో ఆనందంగా ఉంది. అఖండ తర్వాత రిలీజ్ అయ్యే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ అన్ని సినిమాలు హిట్ అవ్వాలి.. నేను సినిమా గెలవాలి అని కోరుకుంటున్నాను.. సినిమా ఖచ్చితంగా గెలుస్తోంది” అంటూ చెప్పుకొచ్చారు.