కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందని చెప్పారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని వెల్లడించారు.
READ MORE: Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..
“ఇందూర్ రైతుల పోరాటాన్ని గుర్తించిన మోడీ సర్కారు పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.. పసుపు రైతులకు శుభాకాంక్షలు.. అనాదిగా నిజామాబాద్ రైతులు పసుపు సాగు చేస్తున్న బయట మార్కెట్లో గుర్తింపు అనుకున్న స్థాయిలో దక్కలేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ పసుపు బోర్డు చేస్తోంది. పసుపు యాంటిబయోటిక్. పసుపు మన దైనందిన జీవితంలో భాగం.. ఇక్కడి పసుపుకి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. 2030 లోపు 1 మిలియన్ డాలర్ పసుపు ఎక్స్పోర్ట్ ప్రణాళిక చేశాం. పసుపు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తాం. 2025 లో పసుపుకి 19 వెల ధర వచ్చింది. రానున్న 3 ఏళ్ళల్లో పసుపు ధర 6 నుంచి 7 వేలు అధికం కానుంది. బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుంది. భారత కో అపరేటివ్ బ్రాంచ్, భారత్ కో అపరేటివ్ ఎక్స్పోర్ట్ బ్రాంచీలు ప్రారంభిస్తాం.” అని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు.