Today Stock Market Roundup 31-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ట్రేడింగ్ రోజుని శుభారంభం చేయటమే కాకుండా ఇన్వెస్టర్లలో మస్త్ జోష్ నింపింది. నిన్న గురువారం సెలవు అనంతరం ఇవాళ శుక్రవారం తిరిగి ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్.. పెట్టుబడిదారుల సంపదను 3 పాయింట్ 7 లక్షల కోట్లు పెంచటం విశేషం.
దీంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎం-క్యాప్ మొత్తం విలువ 258 పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. రెండు కీలక సూచీలు అద్భుతంగా రాణించాయి. ఎనర్జీ.. బ్యాంక్‌లు.. ఫైనాన్షియల్స్.. టెక్నాలజీ స్టాక్‌లు లాభాల బాటలో ముందు వరుసలో నిలిచాయి. ఏప్రిల్ సిరీస్ మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌కి సంబంధించి ఇవాళ మొదటి ట్రేడింగ్ సెషన్ కావటం కూడా మరో చెప్పుకోదగ్గ అంశమే. సెన్సెక్స్ ఒక్కరోజే ఏకంగా వెయ్యీ 31 పాయింట్లు పెరిగి 58 వేల 991 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
6G Technology: ఇక.. 6G దిశగా.. రెడీ అవుతున్న ఇండియా. 100 పేటెంట్లు భారతీయుల సొంతం
నిఫ్టీ 279 పాయింట్లు లాభపడి 17 వేల 359 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 4 కంపెనీలు మాత్రమే తక్కువ వ్యాల్యూ వద్ద ముగిశాయి. రిలయెన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ తదితర సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని 15 సబ్-ఇండెక్స్‌లన్నీ మెరిశాయి.
10 గ్రాముల బంగారం ధర 154 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 59 వేల 470 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 206 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 71 వేల 980 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా పాతిక రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 118 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 10 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 21 పైసల వద్ద స్థిరపడింది.