Tilak Verma Meets Telangana CM Revanth Reddy: ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ సత్కరించి అభినందించారు. తిలక్ సీఎంకి తన బ్యాట్‌ను బహూకరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ…
Cough Syrup: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ తీసుకున్న పిల్లల ఆరోగ్యం క్షీణిస్తోంది. సికార్‌లో ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఆ సిరప్ తీసుకున్న వెంటనే ఆ చిన్నారి శ్వాస ఆగిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైపూర్‌లో ఇలాంటి కేసు వెలుగులోకి రాగా, శ్రీమధోపూర్, భరత్పూర్లలో కూడా సంఘటనలు నమోదయ్యాయి. జైపూర్‌లో అదే మందు తీసుకున్న రెండేళ్ల బాలికను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చాల్సి వచ్చింది.
Odisha: ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధెంకనాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడు విద్యుదాఘాతంతో మరణించాడు. మృతుడిని సిమిలియా గ్రామానికి చెందిన బిశ్వజిత్ బెహెరాగా గుర్తించారు. బిశ్వజిత్ తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడని చెబుతున్నాయి. ఆమె అతన్ని రాత్రికి తన ఇంటికి ఆహ్వానించిందని సమాచారం. ప్రియురాలి ఇంటి గోడ దూకిన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై నేలపై పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని దెంకనల్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు.…
2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నఖ్వీ తన హోటల్ గదికి ట్రోఫీని తీసుకెళ్లాడు. నఖ్వీ ప్రవర్తనపై విస్తృత విమర్శలు వచ్చాయి. తాజాగా మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి ట్రోఫీని అందించడానికి తన సుముఖతను వ్యక్తం చేశాడు. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ భారత జట్టుకు ట్రోఫీని అందించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆయన ఒక షరతు విధించారని క్రిక్‌బజ్ నివేదించింది. భారత జట్టు…
Why Do People Switch to English After Drinking: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు మానరు. అంతే కాదు.. మన దేశంలో మద్యానికి కష్టానికి అనుసంధానం ఉంది. పొదస్తమానం…
Jubilee Hills Bypoll 2025: హైదరాబాద్, సెప్టెంబర్ 30 – రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుధర్శన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి […]
Sarpanch Eligibility: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 31న,…
India vs Pakistan: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. దాయాదిలైన భారత్, పాకిస్థాన్ మధ్య సమరం ప్రారంభమైంది. పాకిస్థాన్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో 41 ఏళ్ల చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి. కానీ ఈ మ్యాచ్‌కు ముందు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా ఈ […]
PCB Files Complaint Against Arshdeep Singh: పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. తాజాగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది. అర్ష్‌దీప్ ప్రేక్షకుల పట్ల “అభ్యంతరకరమైన” సంజ్ఞలు చేశాడని పీసీబీ ఆరోపించింది. పాకిస్థాన్ వార్తా వెబ్సైట్ జియో టీవీ ఈ విషయంపై ఒక నివేదికను ప్రచురించింది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఇండియా సూపర్ ఫోర్ మ్యాచ్ ముగిసిన […]
IND vs PAK: 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా, ఇండియా, పాకిస్థాన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. 1984లో ఆసియా కప్ జరిగినప్పటి నుంచి ఇండియా, పాక్ మధ్య ఎప్పుడూ ఫైనల్ జరగలేదు. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ ఘర్షణ ప్రారంభమయ్యే ముందు.. భారత్, పాక్ జట్లు ఎన్నిసార్లు ఫైనల్‌కు చేరుకున్నాయి? వాటి గెలుపు-ఓటమి నిష్పత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..