Sangareddy: సంగారెడ్డి రాయికోడ్ (మం) శంశోద్దీన్‌పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పీపడ్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా రాజు పోటీ చేస్తున్నాయి. నిన్న రాత్రి మద్దతుదారులు, అభ్యర్థి రాజు మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం.. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని వేళాడుతూ కనిపించాడు రాజు.. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికీ హత్యే అని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Kohli-Rohit: రోహిత్-కోహ్లీలు ఇలానే రాణించాలని కోరుకుంటున్నా.. కోచ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతోంది. రెండో విడత 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనుంది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు. అదేరోజు సా యంత్రం నుంచే ప్రచారం షురూ కానుంది. తొలి విడత పంచాయతీ పోలింగ్ 11న జరుగనుంది. రెండో విడత ఎన్నికలకు శనివారం సాయంత్రమే ప్రచారం మొదలైంది. 12న శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. వీరి ప్రచారానికి కేవలం 5 రోజుల గడువు మాత్రమే ఉంది. పోలింగ్ 14న జరుగుతుంది. మూడో విడత పోలింగ్ 17న జరుగతుంది.