CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..
Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు అధ్యక్షుడు పవన్ ప్రకటన విడుదల చేశారు. "జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరిని నియమిస్తున్నాను. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్వర్తిస్తారు. పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని కనబరుస్తూ, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ…
Odisha: ఒడిశా స్టేట్ ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టయింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్నపత్రాను తీసుకెళ్తున్న ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకైన పేపర్‌ను విజయనగరంలో తీసుకోవడానికి వెళ్తున్న 114 మంది అభ్యర్థులు, ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Chandrababu: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం..
Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ మెహందీ కలకలం సృష్టించింది. మహమ్మద్ అబ్దుల్ వసీం అనే వ్యక్తి కరాచీ పేరుతో డూప్లికేట్ మెహందీ తయారు చేస్తున్నాడు. ఈ మెహందీని మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా ముస్తఫా హిల్స్‌లో ఉన్నా మస్రత్ మెహందీ యూనిట్‌పై దాడి చేశారు. మెహందీ కోన్లు, మిషన్లు అన్ని కలిపి దాదాపు రూ. అయిదు లక్షల మేర ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
NCRB Report: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసింది. 2023లో దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు ఢిల్లీలో నమోదయ్యాయని NCRB నివేదిక పేర్కొంది. అయితే.. 2022తో పోలిస్తే 2023లో ఢిల్లీలో మహిళలపై నేరాలు 5.59 శాతం తగ్గాయని కూడా నివేదిక పేర్కొంది. NCRB నివేదిక ప్రకారం.. 2023లో రాజధాని ఢిల్లీలో మహిళలపై 13,000 కి పైగా నేరాలు నమోదయ్యాయి. 2022లో 14,158 కేసులు, 2021లో […]
Baba Chaitanyananda Saraswati: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. బాబా చైతన్యానంద సరస్వతికి సంబంధించి నివాసాల్లో సోదాలు జరపగా.. నేరారోపణకు సంబంధించిన సామాగ్రి దొరికింది. దర్యాప్తులో భాగంగా నేడు పోలీసు బృందం బాబాతో కలిసి ఇన్స్టిట్యూట్కు వెళ్లింది. ఆ ప్రాంగణంలో రెండవసారి సోదాలు నిర్వహించింది. పోలీసులు ఒక సెక్స్ టాయ్, ఐదు అశ్లీల వీడియో సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, UK మాజీ ప్రధాన మంత్రి డేవిడ్…
GST: సెప్టెంబర్ 2025లో GST స్థూల వసూళ్లు ₹1.89 లక్షల కోట్లకు పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని మరోసారి ప్రదర్శించింది. గతేడాది సెప్టెంబర్ లో ₹1.73 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాదికి 9.1% పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST వసూళ్లు ₹1.80 లక్షల కోట్లను దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. సెప్టెంబర్ వసూళ్లలో ఈ బలమైన పెరుగుదల ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 22, 2025న అమల్లోకి వచ్చిన […]
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జాతర' చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, అభిమానులకు అసలైన పండుగ వార్త అందించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు. మాస్ మహారాజా రవితేజను వింటేజ్ రవితేజ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Uddhav Thackeray: ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. మ్యాచ్‌ను వీక్షించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. థాకరే ప్రకటన రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇంతలో, ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని…