Pushpaka Vimana Story: దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ఆనందోత్సవాల నడుమ దసరా వేడుకలు చేసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు(రేపు) శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాలకు పూజలు చేసుకొనున్నారు.
India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ "దొంగ" అయిన పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీని బీసీసీఐ వదిలిపెట్టే స్థితి కనిపించడం లేదు. ఇంతలో మరో ప్రధాన వార్త వెలువడింది. ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు. అయితే.. ఈ ట్రోఫీని టీం ఇండియాకు ఎప్పుడు అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచింది. కొత్త డీఏ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
UP: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఆరుగురు మృతదేహాలు లభ్యం కావడం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిండూర్ పూర్వా గ్రామంలో పాక్షికంగా కాలిపోయిన ఇంట్లో ఆరుగురు వ్యక్తుల కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.
Trump: ట్రంప్ మంగళవారం అనేక ముఖ్యమైన ప్రకటనలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాను నోబెల్ శాంతి బహుమతిని కోరుకోవడం లేదని, గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ అన్నారు. గాజా వివాదం కోసం తన కాల్పుల విరమణ ప్రతిపాదన దాదాపుగా ఖరారు అయిందని పేర్కొన్నారు. "మధ్యప్రాచ్యం మొత్తం సంతకం చేయమని మేము కోరుతున్నాం. ఇది అసాధ్యమైన పని, కానీ అది పూర్తయింది. ఇప్పుడు మనం హమాస్ కోసం వేచి ఉండాలి. వారు సంతకం చేయకపోతే, పరిణామాలు చాలా భయంకరంగా…
Kanthara 1 :రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, అలాగే బెనిఫిట్ షో ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెరిగిన టికెట్ ధరలు వివరాలు ఈ మేరకు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: టికెట్ ధరపై అదనంగా రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరపై రూ. 100 వరకు […]
Visakhapatnam: మహిళ.. ఇద్దరితో ఈ బంధాన్ని మెయింటేన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మహిళ ఓ వ్యక్తి.. మరో వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో జరిగింది. ఒక్కసారిగా కత్తిపోట్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రైల్వే ఉద్యోగి మీద ఈ దాడి జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత ఎవరో దోపిడీ దొంగలు డబ్బులు, బంగారం కోసం దాడి చేశారనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.
Lovers Suicide: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... కలిసి బతకాలనుకున్నారు... పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించారు... ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు... పోలీసులు ఇరు వైపులా తల్లితండ్రులకు నచ్చచెప్పినా వినిపించుకోలేదు... మీ బతుకు మీరు బతకండంటూ వెళ్లిపోయారు... దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు.
Jagtial: తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు.. డ్రైవర్‌గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ యువకుడిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. అయితే సతీష్‌కు.. రేచపల్లిలోనే నివసించే ఒక యువతితో గత కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ ప్రేమ వ్యవహారమే సతీష్ హత్యకు కారణంగా తెలుస్తోంది.. వారిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పైగా వివాహం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి.. సతీష్‌తో సంబంధాన్ని ముగించమని ఆమెకు సూచించారు.…