CM Chandrababu Meets Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్ లోని డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లారు. కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు.
Kolkata: "ఆపరేషన్ సిందూర్" అనే థీమ్‌తో కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన సరిహద్దు వైమానిక దాడులను ఈ మండపం గుర్తు చేస్తుంది. అయితే.. తాజాగా పోలీసులు ఈ మండపాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం...
Karur Stampede: కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది పిల్లలు సహా 40 మంది మృతి చెందారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయిస్తామని నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ఆదివారం తెలిపింది. ఈ విషాదం ప్రమాదవశాత్తు జరిగినది కాదని, కుట్ర ఫలితమని ఆ పార్టీ ఆరోపించింది.
Karur Stampede at Vijay’s TVK Rally: తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది పిల్లలు సైతం ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. ఇంతలో తొక్కిసలాట గురించి ముఖ్యమైన సమాచారం వెలువడుతోంది. ర్యాలీలో జనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. విజయ్ షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా వచ్చారు. మండుతున్న వేడిలో ఎక్కువసేపు…
Pawan Kalyan- CM Chandrababu రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించిన ముఖ్యమంత్రి, త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.
Aghori-Sri Varshini: అఘోరీ అలియాస్ శ్రీనివాస్, శ్రీ వర్షిణి టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరికి వివాహం జరిగిందన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మళ్లీ ఇద్దరికి సంబంధించిన ఇంటర్వ్యూలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలు కేసులపై ఇటీవల అరెస్ట్ అయిన అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం పలు మీడియా సంస్థలతో మాట్లాడాడు. జైలు జీవితం, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న అంశాలను…
Mithun Manhas: మిథున్ మన్హాస్ BCCI కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మొదట తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్లో ఈ నియామక వార్తను పంచుకున్నారు. మిథున్ మన్హాస్ అధికారికంగా BCCI అధ్యక్షుడిగా నియమితులైనట్లు ట్వీట్లో పేర్కొన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మన్హాస్ అధికారికంగా నియమితులయ్యారు.
Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ నేతృత్వంలో జరిగిన మెగా రాజకీయ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కనీసం 31 మంది మరణించారని సమాచారం. హాజరైన వారిలో చాలా మంది కుప్పకూలిపోయారని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించారు. "పోలీసులు, దయచేసి సహాయం చేయండి" అని మైక్‌లో చెప్పడం వినిపించింది. స్పృహ…
Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే (టీం విజయ్ కజగం) ర్యాలీలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో గందరగోళం చెలరేగింది. ర్యాలీలో తొక్కిసలాట జరిగి, అనేక మంది కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనేక మంది పిల్లలు కూడా స్పృహ కోల్పోయి గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటికే 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. పదుల సంఖ్యలో కార్యకర్తలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ సంఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్…
Rajahmundry: రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో స్థానానికి వెళ్లి ఇద్దరు భవానీలు గల్లంతు అయ్యారు. భవాని మాల వేసుకున్న గుబ్బల బాపిరాజు, రాయుడు వీరబాబు గోదావరిలో గల్లంతు అయ్యారు. గల్లంతయిన వీరిద్దరూ బావ బామ్మర్దులు. బాపిరాజు రాజమండ్రి ప్రకాష్ నగర్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన హాస్పిటల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నా రాయుడు వీరబాబు హైదరాబాదులోని ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. భవాని మాల వేసుకోవడానికి ఇటీవలే రాజమండ్రి వచ్చాడు. ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి స్థానానికి వచ్చి పుష్కర్ ఘాట్‌లో స్థానానికి…