Bigg Boss 19 Winner: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ప్రసిద్ధ రియాలిటీ షో బిగ్ బాస్ 19వ సీజన్ విజేతను ప్రకటించింది. తాన్యా మిట్టల్, ప్రణిత్ మోర్, అమల్ మాలిక్ వంటి బలమైన పోటీదారులను అధిగమించి టీవీ సూపర్ స్టార్ గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. గౌరవ్ విజయంతో బిగ్ బాస్ 19 సీజన్ ముగిసింది. షో ప్రారంభమైన మొదటి రోజు నుంచే గౌరవ్ ఖన్నా తన జ్ఞానం, ప్రశాంత స్వభావం, వ్యూహాన్ని ప్రదర్శించాడు. బిగ్ బాస్ గురించి ఖన్నాకు ఓ అభిప్రాయం ఉంది.. షో అంతటా ఎటువంటి వివాదంలో పాల్గొనలేదు. తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశాడు. టాస్క్‌లలో ప్రతిభ కనబరిచాడు. ఎట్టకేలకు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
READ MORE: Arshad Khan History: ఐపీఎల్ 2026 వేలానికి ముందే అర్షద్ ఖాన్ చరిత్ర!
కాగా.. గత సంవత్సరం బిగ్ బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్‌వీర్ మెహ్రాకు రూ. 50 లక్షల నగదు లభించింది. అలాగే.. ఈసారి, బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకున్న గౌరవ్ ఖన్నా సైతం రూ.50 లక్షలు బహుమతిగా అందుకున్నాడు. ట్రోఫీ, రూ. 50 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఓ కారును కూడా సొంతం చేసుకున్నాడు. గౌరవ్ ఖన్నా ఇప్పటికే సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఫర్హానా భట్, తన్యా మిట్టల్, ప్రణీత్ మోర్, అమాన్ మల్లిక్ లను ఓడించి షో విజేతగా నిలిచాడు.
READ MORE: Salman Khan: బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ భావోద్వేగం.. ఆ వీడియో చూసి కన్నీటిపర్యంతం..