Salman Khan: హిందీ ‘బిగ్‌బాస్ 19’ ఫైనల్ వేదికపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో బిగ్‌బాస్ షోకు ధర్మేంద్ర హాజరైన విషయం తెలిసిందే. ఆ వీడియోను తాజాగా ప్రదర్శించారు. ఆ వీడియోను చూసిన సల్మాన్ కన్నీరు పెట్టుకున్నారు. హీ-మ్యాన్‌ను కోల్పోయాం ఆయనకంటే గొప్పవారు ఎవరూ లేరంటూ ధర్మేంద్రతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కాగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) గత నెలలో కన్నుమూసిన విషయం విదితమే. శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి పెద్ద షాక్‌గా మారింది. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినిమాల్లో అడుగుపెట్టి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.
READ MORE: Rohit-Kohli: రో-కోలు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు!
యాక్షన్ సీన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ధర్మేంద్రకు ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’, ‘యాక్షన్ కింగ్’ అనే బిరుదులు దక్కాయి. ‘షోలే’లో వీరూ పాత్రతో ఇంటి పేరుగా మారారు. అలాగే డ్రీమ్ గర్ల్, లోఫర్, దోస్త్, మేరా నామ్ జోకర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. నటుడిగా అందరికీ స్ఫూర్తి అయిన ధర్మేంద్ర, ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ధర్మేంద్ర కి ఇద్దరు భార్యలు ఉన్నారు. ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలు.
Only #SalmanKhan could have given such a heartfelt tribute to his favourite #Dharmendra ji 🙏
pic.twitter.com/LX47ZCktXT— Navneet Mundhra (@navneet_mundhra) December 7, 2025