Hyderabad: నగరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య కలకలం సృష్టించింది.. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు దుండగులు వెంకటరత్నం(50) అనే రియల్టర్‌ను నడిరోడ్డుపై షూట్ చేసి చంపారు. కాల్పులు జరిపి కత్తులతో నరికి హత్య చేశారు.. పాపను స్కూల్లో దించి స్కూటర్ పై తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్‌తో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.. వెంకటరత్నంపై ధూల్‌పేట్‌లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.
READ MORE: Rupee vs Dollar: డాలర్ తో పోలిస్తే పడిపోతున్న రూపాయి విలువ.. కారణాలు ఇవే!