150 Years Of Vande Mataram: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. నేడు వందేమాతరంపై పార్లమెంట్‌లో 10 గంటల పాటు చర్చ ఉండనుంది. ‘వందేమాతరం’ గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచారు. దీన్ని తన ‘ఆనందమఠం’ నవలలో చేర్చారు. ఇది 1875 నవంబర్ 7న ప్రచురితమైంది. ఇందులో భారతమాతను దేవతగా అభివర్ణించారు. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందేమాతరాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో ఇది స్వాతంత్య్ర ఉద్యమంలో ఫేమస్ అయింది. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవ్‌లతో కూడిన కమిటీ 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కీలక సిఫార్సుతో నివేదిక ఇచ్చింది. ‘వందేమాతరం’లోని మొదటి రెండు చరణాలను మాత్రమే సంబంధితంగా ఉన్నాయని, వాటివల్ల ఎవరి మతపరమైన మనోభావాలు దెబ్బతినవని తెలిపింది. అయితే ముస్లిం లీగ్, కొన్ని ఇతర గ్రూపులు ఆ రెండు చరణాలలోని కొన్ని పద్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వందేమాతర గేయంలోని మొదటి రెండు చరణాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది.
READ MORE: Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ టీమ్ నుంచి అప్‌డేట్..!
వందేమాతర గేయం గురించి భారత రాజ్యాంగ సభలో విభేదాలు తలెత్తాయి. 1947 ఆగస్టు 14న రాత్రి భారత రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఆ సమావేశం ‘వందేమాతరం’ ఆలాపనతో ప్రారంభమై, ‘జన గణ మన’తో ముగిసింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభలో రెండు గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ‘జన గణ మన’ జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ జాతీయ గేయంగా ఉంటాయని ప్రకటించారు. ఈ రెండింటికి సమాన గౌరవం లభిస్తుందని వెల్లడించారు.
అయితే.. కొంతమంది ముస్లింలు వందేమాతరాన్ని వ్యతిరేకిస్తారు. వందేమాతరం గేయాన్ని ఆలపించడం ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని ముస్లిం సమాజంలోని కొందరు వాదిస్తున్నారు. ఈ గేయంలో దుర్గాదేవి స్తుతి ఉందని వారు అంటున్నారు. వ్యక్తులు, వస్తువులను ముస్లింలు పూజించరని వారు చెబుతున్నారు. ముస్లింలు షరియా చట్టం ఆదేశాలను పాటిస్తాయి.. వందేమాతరం గేయంలోని పదాలతో, ఇస్లామిక్ సూత్రాలకు పొంతన కుదరదని కొందరి ముస్లింల వాదన.. ముస్లింలు వందేమాతరం గీతాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం.. ఇస్లాం “ఏకేశ్వరోపాసన” సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. అయితే ఈ గీతంలోని కొన్ని భాగాలలో ‘భారతమాత’ను దేవతగా కీర్తించడం (హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వాటితో పోల్చడం) ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధమని, ఇది బహుదేవతారాధన (షిర్క్) కిందకు వస్తుందని వారు భావిస్తారు. దేశభక్తిని మాతృభూమికి చూపించడం వేరు, దానిని ఒక దేవతగా పూజించడం వేరు అని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి. ఈ కారణంతోనే వారు ఈ గీతంలోని కొన్ని పద్యాలను వ్యతిరేకిస్తారు. ఏకేశ్వరోపాసన (Tawhid) అంటే ఏంటి..? ఇస్లాం ప్రకారం, అల్లాహ్ (దేవుడు) తప్ప మరెవరినీ పూజించకూడదు. వందేమాతరం గీతంలోని “సుజలాం సుఫలాం, మలయజ శీతలాం” వంటి భాగాల తర్వాత వచ్చే పద్యాలు మాతృభూమిని దుర్గా, లక్ష్మి వంటి దేవతలతో పోల్చుతాయి. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని కొందరు ముస్లింలు భావిస్తారు. ఈ కారణాల వల్ల చాలా మంది ముస్లింలు వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడరు..