Hyderabad: మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి కోసం నలభై రోజుల దీక్ష పూనిన అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక పడి పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో పడిపూజ నిర్వహిస్తారు. అనంతరం సామూహికంగా ఆలపించిన పాటలకు భక్తులందరూ తన్మయులై చప్పట్లతో సందడి చేశారు. స్వామి 18 మెట్లను పూల మాలలతో అలంకరించి గణపతి, కుమార స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి, ఉదయం గణపతి పూజతో ప్రాంభించి, సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, కలశం, అమ్మవారి పూజలు జరుపుతారు. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాల ఊరేగింపు నిర్వహించి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు..
READ MORE: BMB : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు.. టైటిల్ పోస్టర్ రిలీజ్
అయితే.. ఈ మహాపడి పూజ సందర్భంగా ఇద్దరు దుండగులు అయ్యప్పల మనోభావాలను దెబ్బతీసేలా ప్రయత్నించారు. అయ్యప్ప పడి పూజపై కోడిగుడ్లను విసిరారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం మెట్టకాని గూడెంలో ఈ ఘటన జరిగింది. ఈ అంశంపై అయ్యప్పలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు తోట ఆదిత్య, రామకృష్ణలుగా గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.