Actor Dileep: 2017 నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళ హై కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 8 ఏళ్ల తర్వాత జరిగిన విచారణలో హైకోర్టు తీర్పు చెప్పింది. దిలీప్ పై కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అయితే.. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మొదటి నుంచీ దిలీప్ చెబుతున్నాడు.. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఈ అంశంపై దిలీప్ స్పందించారు. ఇది తనపై జరిగిన కుట్ర అని అభివర్ణించాడు. కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
READ MORE: Shakib Al Hasan: యూ టర్న్ తీసుకున్న షకీబ్ అల్ హసన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..!
అసలు ఏం జరిగింది.?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న నటి కారు డ్రైవర్ మార్టిన్ ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు పల్సర్ సుని రంగంలోకి దిగాడు. పల్సర్ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. సహకరించకపోతే చంపుతామని బెదిరించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. అనంతరం ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు పొదల్లోకి తోసివేశారు. అప్పట్లో నటిపై లైంగికదాడి, కిడ్నాప్ కేసు ముగుస్తుందని భావిస్తుండగా, ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపులు బయటపడటంతో ఈ వ్యవహారం అప్పట్లో హీట్‌ను పెంచింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, డ్రైవర్ మార్టిన్ అప్పట్లోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెనుక సినీ ప్రముఖుడు దిలీప్ హస్తం ఉందని పోలీసులు భావించి అరెస్ట్ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. తాజాగా దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
READ MORE: December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి