Varshini- Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం గతంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెరలేపింది. అయితే.. తాజాగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని…
Balakrishna: ఏపీ బ్రాండ్ సీఎం చంద్రబాబు అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలోనే సువర్ణ అక్షరాలతో లికించబడుతుందని కొనియాడారు. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన కార్యక్రమని..
Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. సొంతంగా ఇళ్లు కట్టుకోలేని గిరిజన బిడ్డలతో పాటు నిరుపేదలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.2.30 లక్షల చొప్పున మంజూరు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని జగన్ రెడ్డి రూ.1.80 లక్షలకు తగ్గించారని.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగనన్నకాలనీల పేరుతో దుర్మార్గాలకు పాల్పడ్డారన్నారు. భూసేకరణ, లేఅవుట్ల అభివృద్ధితో పాటు…
Gudivada Amarnath: కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాల దండుకుంటున్నారో చెబుతూ బరితెగించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాజాగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే వారికి మందు తాగారా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి, ముఖ్యంగా బాలకృష్ణకు నిర్వహించాలన్నారు. చిరంజీవి అంటే బాలకృష్ణకి ఈర్ష, గతంలో చిరంజీవిని చాలా సార్లు అవమానించారన్నారు.. బాలకృష్ణకి చిరంజీవికి అసలు పోలికే లేదని.. చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన […]
Flood Alert: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి గలగల పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు. 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.
CM Chandrababu: 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం.. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది.. కానీ ఏపీలో దౌర్బాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటి…
Nepal Ex-PM KP Sharma Oli: నేపాల్ మాజీ ప్రధాన మంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. పార్టీ విద్యార్థి విభాగం, రాష్ట్రీయ యువ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన శనివారం భక్తపూర్ చేరుకున్నారు. భారీ నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. నిరసనల ప్రారంభంలో కేపీ ఓలిని నేపాల్ సైన్యం…
Google Caelebrates 27 Years Since: ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్ తాజాగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిని 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ స్థాపించారు. గూగుల్ ను మొదట బ్యాక్ రబ్ అని పిలిచేవారు. ఈ కంపెనీ ఒక సాధారణ సెర్చ్ ఇంజిన్ గా ప్రారంభమైందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ సెర్చ్ ఇంజన్ నేడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో గూగుల్ రోజువారీ జీవితంలో ఒక భాగమైంది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్,…
CM Chandrababu: అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై స్పందించారు. వచ్చే నెల 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.. ఆటో డ్రైవర్లు పెండింగ్ చలాన్లు ఉంటే క్లియర్ చేస్కోవాలని సూచించారు. అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు వాహనమిత్ర ద్వారా 15 వేలు ఆటో డ్రైవర్లకు అందజేస్తామన్నారు. ప్రతి నెలా 1న పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉండే తృప్తి చెప్పలేనిదన్నారు..
AP News: శాసనసభలో ఆమోదం పొందిన 6 చట్టాలకు శాసనమండలి ఆమోదం తెలిపింది.. అంతర్జాతీయ వర్శిటీ ఏర్పాటు బిల్లు-2025కు శాసనమండలి ఆమోదం తెలిపింది. న్యాయవిద్య, పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్శిటీ నిర్ణించనున్నారు. ఏపీ ప్రైవేటు వర్శిటీల (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం-2025 మండలి ఆమోదం పొందింది. ఏపీ వర్శిటీల సవరణ బిల్లు-2025కు శాసనమండలి ఆమోదముద్ర వేసింది.