Scrub Typhus: తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్‌సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Nellore: అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇంకా గోవాలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో చిల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. 18వ తేదీ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉండటంతో నేరుగా కార్పొరేషన్‌కి రానున్నారు. మేయర్ రాజీనామాతో ఇన్‌ఛార్జి మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు.. ఎన్నికల కమిషనర్ తేదీ ఖరారు చేసిన తరువాత కార్పొరేటర్లు కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
Bhawanipur Voters List Controversy: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్‌లో దాదాపు 45,000 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడటంపై టీఎంసీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 45 వేల మంది ఓటర్ల పేర్లు తొలగించబడడంతో…
Local body Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం…
CM Chandrababu Naidu: తెలుగు ప్రజల గౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన ఆత్మార్పణ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనా సీఎం పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు. పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో, స్వాతంత్ర్యానంతరం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. పాలకుల వివక్ష కారణంగా నలిగిపోయిన…
CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతి వనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఉంది. అలాగే వెల్నెస్ సెంటర్, యోగా చేసుకునేందుకు సౌకర్యం, హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ స్టేడియం వంటివి […]
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఓ మాట ఇచ్చారు పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట ప్రకారం.. శారదా హైస్కూల్ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు అందించారు. ఎమ్మెల్యే పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Ambati Rambabu: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ప్రజా ఉద్యమం తీరును అందరూ చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. గత 18 నెలల కాలంగా వైసీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని తెలిపారు.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు..
Tata Sierra Hyperion vs Hyundai Creta N Line: టాటా మోటార్స్ తాజాగా సియెర్రా ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ధరలు రూ. 11.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతున్నాయి. ఈ మోడల్‌తో పాటు కొత్త 1.5 లీటర్ హైపీరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కారణంగా టాటా సియెర్రా ఇప్పుడు ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌కు పోటీగా నిలుస్తోంది. రెండు కార్లు మంచి పనితీరు ఇవ్వడమే కాకుండా, ధర పరంగా కూడా పోటీపడుతున్నాయి. ఇంజిన్…
Raghu Rama Krishna Raju Case: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ ముగిసింది. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1గా ఉన్న సునీల్ కుమార్‌ను విచారణకు రావాలని గతనెల 26న గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో ఉండటంతో విచారణకు రావడానికి పదిహేను రోజులు సమయం కోరారు. దీంతో డిసెంబరు15న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన సునీల్ కుమార్‌ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు.