India vs New Zealand: సెమీస్‌లో గెలిచిన ‘వ్యూహం’ ఫైనల్‌లోనూ రిపీట్.. గంభీర్ ప్లానింగ్ వర్కౌట్ అయితే ట్రోఫీ మనదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ పోరులో టీమిండియా విజయం సాధించింది. రేపు న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలపడనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పరుగులు చేయడం విశేషం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇంత స్కోర్ చేయడం ఇదే మొదటి సారి. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా చాలా మంచి ట్రిక్ ప్లే చేసింది. ఈ వ్యూహం ముందు జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ వంటి ఇంగ్లాండ్ బౌలర్లు నిలవలేకపోయారు. టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఆ ట్రిక్ ఏదో కాదు.. బ్యాటింగ్ ఆర్డర్. కోచ్ గంభీర్ ఓ చిన్న లాజిక్‌ను నమ్ముతారు. టీ20 లాంటి చిన్న ఫార్మాట్‌లో ఫిక్స్‌డ్ బ్యాటింగ్ ఆర్డర్ అన్నదే లేదని, ప్రత్యేకంగా మిడిల్ ఆర్డర్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను పంపించాలని గంభీర్ అభిప్రాయపడుతుంటాడు. మ్యాచ్‌లు ఓడినా పర్వాలేదు.. ఈ విధానాన్ని మార్చే సమస్యే లేదని స్పష్టం చేస్తుంటాడు. ఇంగ్లాండ్‌పై గెలవడంతో ఈ వ్యూహం బాగా పని చేసిందనే చెప్పాలి. ఇదే విధానాన్ని న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే కివీస్ గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు చుక్కలు చూయించే దుబే వంటి బ్యాటర్‌ను ఎప్పుడు బరిలోకి దింపాలి. ఫాస్ట్ బౌలింగ్‌లో తడబడకుండా ఆడే బ్యాటర్లను ఎప్పుడు గ్రౌండ్‌లోకి పంపాలనే వ్యూహాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే భారీ స్కోర్ చేయొచ్చు. ఒక వేళ టీమిండియా మొదట బౌలింగ్ చేసినా.. ఛేజింగ్ సులభమవుతుంది. అంతే కాదు.. బ్యాటింగ్‌లోనూ గత మ్యాచ్‌లో అద్భుత నిర్ణయాలు తీసుకున్నాడు కెప్టెన్ సూర్య.. ఈ మ్యాచ్‌లోనూ ఎలాంటి ఒత్తిడి లేకుండా అదే స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి. ఇక గత సెమీ ఫైనల్‌లో వ్యూహాల గురించి చర్చిద్దాం..
READ MORE: CM Chandrababu: ప్రజాప్రతినిధులు ఓ కుటుంబంలా కలిసి పనిచేయాలి..!
Also Read
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
వాస్తవానికి.. పదో ఓవర్‌లో ఆదిల్ రషీద్ ఇషాన్ కిషన్ వికెట్ పడగొట్టాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తారని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ.. ఇక్కడ భారత్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. సూర్యకుమార్‌కు బదులుగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ శివమ్ దూబేను నాలుగో స్థానంలో పంపింది. దానికి బలమైన కారణం ఉంది. లెగ్ స్పిన్ బౌలింగ్‌ను బలంగా ఎదుర్కొనే బ్యాటర్లలో దూబే ఒకడిగా గుర్తింపు పొందాడు. సంజూ శామ్సన్ రషీద్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడుతుండగా దూబే మాత్రం దాడి మొదలుపెట్టాడు. కేవలం ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. తర్వాత సంజూ ఔటైనా భారత్ వ్యూహం మారలేదు. ఎడమచేతి-కుడిచేతి బ్యాటర్ల కలయిక కొనసాగాలని భావించి హార్దిక్ పాండ్యాను క్రీజ్‌లోకి పంపింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లకు లైన్, లెంగ్త్ కుదరకపోయింది. దూబే దాడి కారణంగా హ్యారీ బ్రూక్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ముందుగానే బౌలింగ్‌కు తీసుకురావాల్సి వచ్చింది. భారత్ మాత్రం పరిస్థితిని బట్టి బ్యాటర్లను మార్చుతూ ఇంగ్లాండ్ జట్టును గందరగోళంలో పడేసింది.
READ MORE: Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!
ఇంకా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తిలక్ వర్మను చివరి ఓవర్ల వరకు ఆపడం. ఫాస్ట్ బౌలర్‌ను తిలక్ బాగా ఎదుర్కొంటాడనే నమ్మకం జట్టుకు ఉంది. ఈ వ్యూహం బాగా పని చేసింది. ఈ విధంగా భారత్ ప్రతి దశలో అప్పటి పరిస్థితులకు సరిపోయే బ్యాటర్‌ను పంపుతూ మ్యాచ్‌ను తన చేతుల్లో ఉంచుకుంది. భారత్ ప్రతిభ కేవలం బ్యాటింగ్‌లోనే కాదు. బౌలింగ్‌లోనూ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. వాంఖడే మైదానంలో రాత్రి సమయంలో పిచ్ బ్యాటర్లకు ఈజీగా మారుతుందని భారత జట్టు ముందే అంచనా వేసింది. అందుకే మొదట్లోనే వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలో పెట్టాలని నిర్ణయించింది. హార్దిక్ పాండ్యాను తొందరగా బౌలింగ్‌కు తీసుకువచ్చి మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ తీసింది భారత్. మరోవైపు జస్ప్రీత్ బుమ్రాను పవర్ ప్లేలోనే ఉపయోగించి హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయాలని వ్యూహం రచించారు. బుమ్రా వేగం మార్పుతో వేసిన బంతికి బ్రూక్ తప్పుగా ఆడగా అక్షర్ పటేల్ వెనక్కి పరుగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇంకా ముఖ్యంగా చివరి పది ఓవర్ల కోసం బుమ్రా మూడు ఓవర్లను ఆపడం భారత్ చేసిన గొప్ప వ్యూహం. పదహారు, పద్దెనిమిదో ఓవర్లలో బుమ్రా వేసిన బౌలింగ్ ఇంగ్లాండ్ ఆశలను దాదాపు ముగించింది. అప్పటికే ఇంగ్లాండ్‌కు ప్రతి ఓవర్‌కు పద్నాలుగు పరుగులు అవసరం. కానీ బుమ్రా కేవలం పద్నాలుగు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. ఇక ఇదే వ్యూహం ఫైనల్‌లోనూ ఫాలో అయితే.. కప్పు మనదే!
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?