SSC Maths Study Tips: టెన్త్ పరీక్షలకు రెడీనా? మ్యాథ్స్ టెన్షన్ తగ్గించే సూపర్ స్టడీ టిప్స్ మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS-AP SSC Exams: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల సర్వం సిద్ధమైంది. తెలంగాణ(Telangana)లో ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్లు(SSC Hall Tickets) విడుదలయ్యాయి. పరీక్షల కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. టీజీలో మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మార్చి 16 నుంచి పరీక్షల పర్వం స్టార్ట్ కానుంది. ఈ పరీక్షల నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల మనసుల్లో ఒకే భావన తిరుగుతూ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు ఒకలా అనిపించినా ఒక సబ్జెక్ట్ మాత్రం గుండెల్లో చిన్న టెన్షన్‌ను పెంచుతుంది. అదే మ్యాథ్స్(Maths). కొందరికి అది ఫ్రెండ్‌లా మారుతుంటే.. మరి కొందరికి భూతంలా కనిపిస్తోంది. పరీక్ష పేపర్‌లో అంకెలు, సంఖ్యలు కనిపిస్తే చాలా గుండె ఇంకొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. లెక్కలు, తదితర పాఠాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. కానీ నిజానికి మ్యాథ్స్ భయపెట్టే సబ్జెక్ట్ కాదు.. దీన్ని మనసు పెట్టి అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ఈ మ్యాథ్స్‌ను ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Pink Ball Test: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సత్తా చాటుతుందా? నేటి నుంచే ఏకైక పింక్ బాల్ టెస్ట్!
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
మ్యాథ్స్ లేని జీవితం లేదు:
మన జీవన శైలిలో మ్యాథ్స్ సర్వసాధారణం. ఉదయం గడియారం మోగే సమయం నుంచి రాత్రి నిద్రపోయే సమయం వరకు సంఖ్యలే మన రోజును నడిపిస్తాయి. బస్సు టైమ్ చూసుకోవడం, మార్కెట్‌లో వస్తువుల ధరలు, ఇల్లు కట్టాలంటే కొలతలు, రోడ్డు వేయాలంటే కోణాలు, వంతెన నిలవాలంటే లెక్కలు అన్నీ గణితానికి సంబంధించినవే. ప్రపంచం ముందుకు నడవడానికి కనిపించని ఒకే ఒక్క శక్తి మ్యాథ్స్. అందుకే గణితం కేవలం పుస్తకాల్లో ఉండే సబ్జెక్ట్ కాదు. అది జీవితాన్ని నడిచే ఒక తత్వం. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఈజీగా మారల్చుకోవాలంటే.. సింపుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం..
ప్రాక్టీస్ మేక్ ఎవ్రి వన్ పర్ఫెక్ట్:
మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదట మనసులోని భయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది విద్యార్థులు ఒక పొరపాటు చేస్తారు. ప్రాబ్లెమ్‌ను ఒకసారి చూసి అర్థం కాలేదంటే వెంటనే దాన్ని కష్టమని తేల్చేస్తుంటారు. కానీ మ్యాథ్స్ అసలు మంత్రం ఒక్కటే.. అదే ప్రాక్టీస్. ఒక ప్రాబ్లెమ్‌ను ఒకసారి చేయడం కంటే రెండు సార్లు చేయడం మంచిది. రెండు సార్లు కంటే మూడు సార్లు చేయడం ఇంకా మంచిది. ప్రతి దశను నెమ్మదిగా రాస్తూ, ఎందుకు ఇలా వస్తుందో అర్థం చేసుకుంటూ చేస్తే మెదడు ఆ విధానాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అప్పుడు అదే తరహా లెక్క మరోసారి కనిపించినా భయం ఉండదు. ముఖ్యంగా షార్ట్ కట్స్ జోలికి పోవద్దు.. అసలైన బెసిక్ మోడల్‌నే ముందుగా నేర్చుకోవాలి.
మూడు సార్లు చేయాలి:
మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాబ్లెమ్‌ను కేవలం చూసి అర్థం చేసుకుంటే సరిపోదు. చేతితో రాయాలి. పెన్ పేపర్‌పై నడిస్తేనే మెదడు కూడా పని చేస్తుంది. ప్రతి స్టెప్ రాస్తూ ముందుకు వెళ్లడం వల్ల తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. చిన్న తప్పులు కూడా గమనించడం అలవాటు అయితే మార్కులు కూడా పెరుగుతాయి.
ముందుగా ఈజీ క్వశ్చన్స్‌తో స్టార్ట్ చేయండి:
పరీక్షా హాల్లోకి వెళ్లినప్పుడు కూడా ఒక చిన్న వ్యూహం ఉంటే మ్యాథ్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే మొత్తం పేపర్‌ను ఒకసారి ప్రశాంతంగా చూడాలి. వెంటనే కష్టమైన ప్రశ్నలపై ఆలోచించకుండా ఈజీగా అనిపించే క్వశ్చన్‌తో ప్రారంభించాలి. మొదటి కొన్ని ప్రాబ్లెమ్స్ వచ్చాయంటే మనసులో ధైర్యం పెరుగుతుంది. ఆ ధైర్యం తర్వాతి ప్రాబ్లెమ్స్‌ను కూడా సులభంగా చేయిస్తుంది. మ్యాథ్స్ అనేది మెదడు ఆలోచనల ప్రవాహం లాంటిది. ఒకసారి అది సరిగ్గా నడవడం మొదలైతే లెక్కలు వరుసగా చేస్తూ వెళ్లిపోవచ్చు.
పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో మ్యాథ్స్ పరీక్ష మార్చి 28న జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 23న ఉంది. ఈ కొద్దీ రోజులను టెన్షన్‌తో కాకుండా ప్రాక్టీస్‌తో నింపుకుంటే మ్యాథ్స్ మనకు పెద్ద బలం అవుతుంది. రోజుకు కొంత సమయం కేటాయించి పాత ప్రశ్నాపత్రాలు చూసి ప్రాక్టీస్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. నిజానికి సంఖ్యలు మనతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మ్యాథ్స్ అందంగా కనిపిస్తుంది. లెక్కలు క్రమంగా కుదిరినప్పుడు ఒక చిన్న ఆనందం మనసులో పుడుతుంది. ఆ ఆనందమే మ్యాథ్స్ మనకు ఇచ్చే అందం. భయం తగ్గి ప్రాక్టీస్ పెరిగితే మ్యాథ్స్ కూడా మనకు మంచి మార్కుల రూపంలో నవ్వుతుంది. ఈ నంబర్స్ వరల్డ్‌ను డేర్‌గా ఎదుర్కొంటే విజయానికి దారి కూడా అదే సంఖ్యలు చూపిస్తాయి.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..