Vikarabad: శంకర్పల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారణంగా భారీ ప్రమాదం సంభవించింది. వికారాబాద్ నుంచి శంకర్పల్లి వైపు వెళ్తున్న బస్సు, మహాలింగపూరం వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారు మొత్తానికి వ్యాప్తించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
Hyderabad: అంబర్పేట్ ఎస్సై తుపాకీ మిస్టరీ వీడింది. తుపాకీ ఆచూకీ లభ్యమైంది.. ఇటీవల.. పోటీ పరీక్షల కోసం ఎస్సై భాను ప్రకాష్ విజయవాడకు వెళ్లాడు.. అక్కడ ఒక లాడ్జిలో వారం రోజులు పాటు బసచేశాడు. తనతో పాటు తుపాకీని తీసుకొని వెళ్లాడు. పోటీ పరీక్షలు రాసిన తర్వాత తుపాకీతో ఉన్న బ్యాగు కనిపించకుండా పోవడంతో హైరానా పడ్డాడు. లాడ్జీ సిబ్బందిని నిలదీసినప్పటికీ ప్రయోజనం శూన్యమైంది.. విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కి చేరుకున్నాడు.
Pakistan: జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి.? ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ప్రస్తుతం మాజీ ప్రధాని స్థితి, పరిస్థితిని తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పినా నమ్మసక్యంగా అనిపించడం లేదు. షాబాజ్ ప్రభుత్వం, వల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పదే పదే చెబుతున్నప్పటికీ కుటుంబీకులు, పార్టీ అంగీకరించడం లేదు. ఇంతలో ఇమ్రాన్ ఖాన్…
DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం…
Uttam Kumar Reddy: ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాలసీ అర్థం కాక చేస్తున్నారా..? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కూడా కాదని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద విద్యుత్ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు నిన్న(బుధవారం) ఆరోపించారు. రామగుండం, పాల్వంచ, మక్తల్‌లలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం వెనుక.. దాదాపు రూ.50…
Devineni Avinash: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు పూర్తయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అయినా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని కొనియాడారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా…
ED Raids: దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు, గోప్య సమాచారం లీక్ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ (NCT) సహా పది రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ఒకేసారి ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాలు సీబీఐ నమోదు చేసిన FIR No. RC2182025A0014 (తేది 30-06-2025) ఆధారంగా జరుగుతున్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు.
Hyderabad: తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు.. బీజేవైఎం కార్యకర్తలు స్వాములతో కలిసి వచ్చారు. స్వాములను పోలీసులు అడ్డుకున్నారు.. కొందరి అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫాంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేశారు అయ్యప్ప స్వాములు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయంటున్నారు..
TGPSC Group 2 Case: గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.. 2015 లో నిర్వహించిన గ్రూప్ 2కు 2019లో TGPSC సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ సెలక్షన్ లిస్టుని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై పిటిషనర్ డివిజన్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది.
Adilabad: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. నామినేషన్ రోజు మరో సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సైత…