Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల కవితను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.
Telangana Police Bust Delhi Drug Mafia: తెలంగాణ పోలీసులు మరోసారి మన్ననలు పొందారు. గ్రేట్ అని నిరూపించుకున్నారు. అక్కడ ఇక్కడ కాదు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ మాఫియాను అడ్డుకుని ప్రధాన నిందితుడు సహా అనేక మందిని అరెస్ట్ చేశారు. తాజాగా తెలంగాణ పోలీస్, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ జాయింట్ సీపీ మాట్లాడారు. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న బ్యాచ్లో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం.. తెలంగాణ ఈగల్ టీం ఏడు మందిని…
Winter Eye Problems Rising: చలికాలం మొదలైంది. చలి రోజు రోజుకూ పెరుగుతోంది. చలికాలం మొదలయ్యాక చల్లని గాలులతో పాటు మన కళ్లపై పడే భారం కూడా పెరుగుతుంది. రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న అసౌకర్యాలుగా కనిపించే సమస్యలు, అసలు లోతులో తీవ్రమైన కంటి వ్యాధులకు సంకేతమై ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో కళ్లలో వాపు, ఎర్రబారడం లేదా నీరు కారడం వంటి లక్షణాలు వివపరీతంగా పెరుగుతాయి. కేవలం వాతారణతోనే కాకుండా.. కళ్ల ఉపరితలం తన సహజ రక్షణ పొరను కోల్పోవడం…
High Court: పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంచాయితీ ఎన్నికలపై స్టే విధించ లేమని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలపై జీఓ 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది హైకోర్టు. ఎన్నికలపై స్టే విధించలేమని విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది. నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. "మేమే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇవ్వగలం" అని కోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని…
Hyderabad: తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇన్ఛార్జీ మంత్రి ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ NTPC వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు.. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది.. స్థానిక…
Maoist Party: మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMC) పేరిట కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిన ఈ లేఖలో ప్రభుత్వం పిలుపు ఇస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి ఒక నెలపాటు హత్యాబంద్ (కిలింగ్ స్టాప్), పోరాట విరామం అమలు చేయాలని మావోయిస్టులు నిర్ణయించారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Maoist Party: మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన మార్పుకు సూచించే ప్రకటన వెలువడింది. ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణకు సిద్ధమయ్యామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ఎవరికి వారు వ్యక్తిగతంగా లొంగిపోయే బదులు సమూహంగా ముందుకు రావడానికి సిద్ధమయ్యాం అని ప్రకటనలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Virat Kohli MS Dhoni in Ranchi: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేకు సిద్ధమవుతున్న సమయంలో గురువారం సాయంత్రం కోహ్లీ రాంచీలోని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసానికి చేరుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కోహ్లీ కారు ధోనీ ఇంటి గేటు దాటుతుండగా బయట భారీగా చేరుకున్న అభిమానులు ఒక్కసారిగా హోరెత్తిపోయారు. మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు తహతహలాడారు.
Rape Case: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని గౌహర్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నవంబర్ 21వ తేదీ శుక్రవారం రాత్రి, ఓ కామాంధుడు బాలికపై అత్యాచారాని ఒడిగట్టాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ఏడవ రోజున నిందితుడు సల్మాన్ అలియాస్ నాజర్ను…
Former Naxalite Murder: ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూ మాజీ నక్సలైట్ ప్రాణం తీసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్ను దారుణ హత్య చేశాడు ఓ వ్యక్తి. తంగళ్లపల్లి (మం) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్ను సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. నరసయ్యను హత్య చేసిన తరువాత జగిత్యాల పోలీసులు లొంగిపోయాడు సంతోష్..