Supreme Court: నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. రెండ్రోజుల క్రితం 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ లను కొట్టివేశారు. గత విచారణ సందర్భంగా.. స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్ పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలం, భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణించారు. అనంతరం.. వేలాది మంది షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హాది భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.
Harish Rao: రేవంత్ రెడ్డి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్, నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్ మాత్రం యాప్ లు, మ్యాప్ లు కావాలి అంటుందన్నారు. తాజాగా మెదక్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి వచ్చాక బస్ ఛార్జీలు రెండేళ్లలో రెండింతలు పెరిగాయి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఆరోపించారు. రైతులకు యూరియా సరిపడ రెండు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు.. కాంగ్రెస్ చేసే తుగ్లక్ […]
Congress vs BJP: తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన చేపట్టారు. దీంతో గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నో వాలో వచ్చారు.. బీజేపీ…
Nampally Court Bomb Threat: నగరంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు పరిసరాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.
Nissan Gravite Compact MPV India Launch in 2026: నిస్సాన్ ఇండియా తన తాజా కాంపాక్ట్ ఎంపీవీని ‘గ్రావైట్’ అనే పేరుతో పరిచయం చేసింది. ఈ కారు భారత మార్కెట్లో 2026 ప్రారంభంలో లాంచ్ కానుంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. 2026 మార్చి నుంచి షోరూమ్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఇదే సమయంలో నిస్సాన్ కొత్త ప్రోడక్ట్ లైనప్‌లో భాగంగా ‘టెక్టాన్’ SUVను కూడా ఇటీవల పరిచయం చేసింది. అంతేకాదు, 2027లో మరో 7-సీటర్ SUVను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కొత్త ఏడాదిలో…
Bachelor Cooking Recipes: బ్యాచ్‌లర్స్‌కి వంట అనేది చాలా పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంది. టైమ్ తో పాటు వంట సామాగ్రి సైతం తక్కువగానే ఉంటుంది. ఓపిక కూడా అంతగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కడుపు నిండేలా, రుచిగా, తక్కువ ఖర్చుతో చేసుకునే కర్రీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పుడు వివరించే ఈ రెండు కర్రీలు ప్రత్యేకంగా బ్యాచ్లర్స్ కోసం. చేయడానికి చాలా సులభం, కొత్తగా వంట మొదలుపెట్టినవాళ్లకూ ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి.
Congress: రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. మూడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపర్చిన 2,060 మందికి పైగా సర్పంచ్‌లు విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు భారీగా లభించిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 1,060 మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల గెలుపులను కలిపినా మొత్తం సర్పంచ్ స్థానాల్లో 30 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. దీంతో…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తానే పొగిడేసుకున్నాడు. “10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశాను” అని చెప్పుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్లేనని పేర్కొన్నారు. తాజాగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం “టారిఫ్స్” అన్నారు. అలాగే.. పదవీ విరమణ చేసిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తనకు అస్తవ్యస్త పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. “నేను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టాను. 10 నెలల్లో […]
One Vote Victory: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడో విడత ఎన్నికలతో గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. చివరి దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,652 మంది, వార్డు సభ్యులుగా 75,725 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 80.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.