Abhishek Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరుఫున ఆడుతున్న అభిషేక్ ప్రత్యర్థి బెంగాల్ జట్టుకు చుక్కలు చూపించాడు. నేడు నవంబర్ 30 ఆదివారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ 52 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో సహా 148 పరుగులు చేశాడు. ఇది అభిషేక్ శర్మకు T20 క్రికెట్లో ఎనిమిదో సెంచరీ. 157 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు ఈ స్టార్…
Pakistan vs Sri Lanka: తాజాగా పాకిస్థాన్ జట్టు శ్రీలంక జట్లు మధ్య టీ20 సిరీస్ ముగిసింది. పాక్ T20I ట్రై-సిరీస్ను గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీ శనివారం రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది పాక్.. ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పెద్ద సమస్యగా మారింది. ఇది పాక్ ఆటగాళ్లు ఫఖర్…
Sarpanch Qualities: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో (డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17) సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి రెండో విడత మొదలు కానుంది. అయితే.. అసలు సర్పంచ్ ఎలా ఉండాలి..? ప్రజలకు సేవ చేసే గుణం మీ సర్పంచ్ అభ్యర్థిలో ఉందా..? ఈ పది పాయింట్స్…
Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైరింజన్లు…
Suryapet: తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామీణ రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. సాధారణంగా గ్రామస్థాయి పదవుల కోసం స్థానికులు, వ్యాపారులు, రైతులు పోటీకి దిగడం చూస్తుంటాము. అయితే ఈసారి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది. సర్వీస్ మిగిలి ఉండగానే సబ్ఇన్స్పెక్టర్ పులి వెంకటేశ్వర్లు ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ పదవికే నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్లో 8 మంది వ్యక్తులకు పోలీసులకు చిక్కారు. ప్రశ్నిస్తే మొదట్లో ఎవరూ…
Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.
Bhatti Vikramarka: 2047 వరకు మూడు ట్రిలియన్ల ఎకానమీకి చేరుకోవాలనేది లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు కావలసిన పెట్టుబడులకు అవసరమైనది విద్యుత్ అన్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాం.. పవర్ డిమాండ్ రాష్ట్రంలో పదేళ్లుగా పెరుగుతుందని తెలిపారు. తాజాగా ప్రజా భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. 2014 నుంచి విద్యుత్తు 14.2 డిమాండ్ గ్రోత్ ఉందన్నారు.. 2020- 2021 నుంచి 5.44 గ్రోత్, 2024- 25లో 9.8 శాతం గ్రోత్ కనిపించిందని…
Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరేసిన కేటుగాడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యువతులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్నారు. ఆ యువకుడి పేరు మహమ్మద్ షాజాద్ గా గుర్తించారు. బీహార్, పాట్నా జిల్లా, పలిగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాజాద్ ఆలం.. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సోషల్ మీడియాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్నంటూ పలు ఫోటోలు, వీడియోలు పంచుకున్నాడు.
Heart Attack Early Signs: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ప్రారంభ సంకేతాలు చాలా సార్లు కేవలం ఛాతీ నొప్పితోనే కాకుండా చేతుల్లో లాగుడు, దవడవైపు వ్యాపించే నొప్పి, ఆకస్మికంగా వచ్చే చెమటలు, శ్వాసలో ఇబ్బంది రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలు వస్తే భయంతో గందరగోళానికి గురికావొద్దు. తక్షణ ఉపశమనం అందించే నైట్రేట్ ఆధారిత మందులు నాలుక క్రింద ఉంచితే రక్తనాళాలు సడలిపోతాయని…