వాహనాల కొనుగోలులో భారతదేశంలోని ఒక రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వెనుకకు నెట్టింది. ఆ రాష్ట్రం ఏదీ? అనుకుంటున్నారా? అది ఛత్తీస్‌గఢ్.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.
క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు.
జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమానాలు ప్రభావితం అయ్యాయి. టిక్కెట్ల విక్రయాలు కూడా నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది.
2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ దేశవ్యాప్తంగా వలస కూలీలు, పేదలకు చేసిన సాయం అందరికీ తెలిసిందే. తన ఆస్తిని తనఖా పెట్టి దేశ, విదేశాలలో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థావరాలకు చేర్చాడు.
ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో లభించే ప్రోటీన్ పౌడర్ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపి ఉండొచ్చు. ఇవేమీ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, సరసమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం మంచిది.
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు పొగ మంచుతో వాహనదారులకు ఇబ్బందులు కలగనున్నాయి. దట్టమైన పొగమంచుతో ఊరేదో.. అడవేదో.. రోడ్డేదో.. చెట్టేదో తెలియకుండా పోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్పత్ నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి.