ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వికాస్ నగర్లో…
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్‌లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024' నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మతపెద్దలు వివరించారు. కాగా.. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, క్రిస్మస్, శాంటా క్లాజ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
భారతీయ రైళ్లలో విక్రేతలు తిరుగుతూ.. ప్రయాణికులకు టీ అమ్మడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఇండిగో విమానంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విమానంలో తిరిగి ప్రయాణికులకు డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ అందిస్తున్నాడు. అంతే కాకుండా రైళ్లో మాదిరిగానే "చాయ్.. చాయ్.." అంటూ అరుస్తున్నాడు.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత.. జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కలిసి 48చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకొన్న భాజపా.. 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలకు పైగా గడిచింది.