జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డుల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అధికార జేఎంఎంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశీయుల పేరుతో నకిలీ ఓట్లు వేయించారని బీజేపీ ఆరోపించింది.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యాంగం, బాబా సాహెబ్ అంబేడ్కర్, రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు పరస్పరం దళిత వ్యతిరేకులుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో 'రాజ్యాంగం ఎవరు రాశారో వారు మద్యం తాగి రాసి ఉంటారు' అనే కేజ్రీవాల్ చెప్పినట్లు ఉంది.
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం ఎన్నో కొత్త మైలురాళ్లను సాధించింది. కంపెనీలు అనేక కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ఏడాది విడుదలైన కొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కొన్ని కార్ మోడల్‌లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. అవి మునుపటి కంటే సురక్షితంగా మారాయి. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.
గత కొన్ని రోజులుగా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ పేరుతో రాజకీయ పోరాటం సాగుతోంది. పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ సహా పలు రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంది.
జపాన్ ఆటో కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనాన్ని ప్రకటించాయి. రెండు కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయని నిస్సాన్ సీఈవో తెలిపారు. ఈ విలీనం తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీ ఉనికిలోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం పెను మార్పుల దశకు చేరుకోవడం చూస్తున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తొలగిస్తూనే మరోవైపు చైనా ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఈ కంపెనీలకు కలిసి వస్తుందని నిపుణులు…
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు వెలువరించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫీలియా) అత్యంత హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం చట్టంలో ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదని కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా కాబోతున్న డొనాల్డ్ ట్రంప్.. కెనడాను తమ దేశంలో 51వ ప్రావిన్స్‌గా మార్చాలని సరదాగా మాట్లాడారు. అయితే నేడు కెనడా ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. భారీ పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ చేసిన ఈ జోక్‌ను రియాలిటీగా మార్చడం గురించి కెనడాలో చాలా మంది చర్చించుకుంటున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు అహల్యా నగర్లో సీనియర్ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నా హజారేతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ అన్నా హజారేతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా ఉన్నారు. సీఎం దేవేంద్ర తన సోషల్ మీడియా హ్యాండిల్లో దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోను పంచుకున్నారు.
ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరం చురుకుగా ఉండటానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం. శరీర చురుకు దనం కోసం రోజూ కొంత సమయం పాటు శారీరక శ్రమ చేయాలి. శరీర శ్రమలో నడక సులభమైన మార్గం.