మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం ముదురుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నను లేవనెత్తుతూ.. "ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు.. అన్ని విభేదాలు కూడా అతనితో అంతం కావాలి.
టెస్టు క్రికెట్లో తొలి అడుగు వేసిన నితీష్ కుమార్ రెడ్డి.. భారత్‌కు 'ట్రబుల్షూటర్' పాత్ర పోషించాడు. నాలుగో టెస్టు మూడో రోజు సెంచరీతో ఆస్ట్రేలియా విజయ ఆశలపై నీళ్లు చల్లాడు. నితీష్ చేసిన105 పరుగుల చేశాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట త్వరగా ముగిసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు.
చర్చిలోపల 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన ఉదంతం మేఘాలయలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్‌పై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ ఫిర్యాదు చేశారు. ఎపిఫనీ చర్చిలోకి నిబంధనలు అతిక్రమించాడని, చర్చి యొక్క మతపరమైన పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీశాడని పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ కూరగాయల నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్, పలు కారణాలతో బయటకు వెళ్ల లేక ఆన్లైన్ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు.
అతి వేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. మాదాపూర్ పరిధిలో బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో బుల్లెట్ బైక్‌పై వేగంగా ఇచ్చిన ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ వచ్చారని వెల్లడించారు.