పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరీ ఎక్కువ సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్‌ను వీడిన విషయం తెల్సిందే. దాంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ రాజకీయంలో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యమౌతూ వచ్చింది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన పవన్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టడంతో షూటింగ్‌కు డేట్‌లు ఇవ్వడం కష్టతరమైంది.
READ MORE: Telangana Assembly : సభ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్.. స్పీకర్ సంచలన నిర్ణయం
కాగా.. హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు సైతం విడుదలయ్యాయి. దీంతో ఈ సినిమా కచ్చితంగా 28న విడుదలవుతుందని అభిమానులు భావించారు. కానీ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్‌పై వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా మే 9న విడుదలవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు మరోసారి రిలీజ్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు.
READ MORE: Lunar Eclipse: రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా?