హీరో నాని ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరొకపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన హీరోగా హిట్లు కొడుతూనే నిర్మాతగా కూడా హిట్లు కొడుతూ డబ్బులు వెనకేసుకుంటున్నాడు. తాజాగా నాని సమర్పిస్తున్న కోర్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మీద నాని ముందు నుంచి నమ్మకం కనబరుస్తున్నారు. ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం కామన్ అయింది కానీ ఏకంగా రెండు రోజులు ముందు మీడియాకి ప్రీమియర్స్ వేసి తన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు నాని.
READ MORE: TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
ఈ సినిమా ప్రమోషన్స్ లో శివాజీ మాట్లాడుతూ నాని అనగానే ఒక బ్రాండ్ అనే ముద్ర అందరిలో పడిపోతోంది, కచ్చితంగా ఈ కోర్టు సినిమాతో అది మరింత ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పారు. ఆయన అన్నట్టుగానే నాని నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రీమియర్స్ తో మంచి టాక్ రావడంతో బుకింగ్లు కూడా బాగానే అవుతున్నాయి. బుక్ మై షో లో ట్రెండింగ్ అవుతుంది. నాని ఈ సినిమాని దాదాపు 11 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందించారు. అందులో ఇప్పటికే నాన్ ధియేటర్ రైట్స్ ద్వారా 9.30 కోట్ల రూపాయలు వెనక్కి రాబట్టారు. ఇంకా కేవలం రెండున్నర కోట్లు మాత్రమే థియేట్రికల్ నుంచి రావాల్సి ఉంది. ఈ వారం ట్రెండ్ బట్టి చూస్తే అలా రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు.