తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు గతంలో స్పందించారు.
నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వింత వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో హాలిడే అంటూ ప్రకటన వెలువడింది. ఇవ్వాళ ఉదయాన్నే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పేరుతో ఓపీ వైద్య సేవలకు సెలవు అని ప్రకటన విడుదలైంది. ఇది ప్రకటించిన కొన్ని గంటలకు మరోసారి ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథాతథం అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రోగులతో పాటు, వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇటువంటి ప్రకటనల వల్ల అనేకమంది రోగులు ఇబ్బందులు పడ్డారు.
పోలీస్ శాఖలో ఇప్పుడు అక్రమార్కులు పుట్టుకొస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని అరికట్టాల్సిన 'రక్షక భటులే భక్షక భటులుగా' మారుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చేతులు చాచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎయిర్పోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ అడుగు ముందుకే అక్రమ దందా ప్రారంభించారు. అక్రమ సొమ్ముకు కక్కుర్తి పడి తమ స్థాయిని, బాధ్యత మరిచారు. కంచే చేను మేసినట్లు, అవినీతిపరుల ఆటకట్టించాల్సిన పోలీసులే అడ్డదారుల తొక్కారు. అసలేం జరిగిందంటే..
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో మంచం మీద పడుకున్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ.. "ఇది మన్మోహన్ సింగ్ చివరి క్షణాల ఫొటో" అని పేర్కొంటున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంతో తెలుసుకుందాం..
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో 26 డిసెంబర్ రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
26 డిసెంబర్ 2024 రాత్రి.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దేశానికి రెండుసార్లు (2004-2014) ప్రధానమంత్రిగా పనిచేసిన సాటిలేని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ తన 92వ ఏట తుది శ్వాస విడిచారు. ఆయన తీసుకొచ్చిన చాలా విధానాలు కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఊపిరి పోశాయి. అతలాకుతలమైన భారత ఆర్థిక వ్యవస్థకు పునర్జీవాన్ని అందించాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఆయనకు భావోద్వేగంతో నివాళులు అర్పిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే 7 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య పోరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేకి అని అజయ్ మాకెన్ అనడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. READ MORE: Telangana DGP: పోలీసులు వద్దంటే వినాలి.. సినీ ప్రముఖులతో డీజీపీ.. ఆసీస్ […]
రైలు టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ (IRCTC) గురువారం ఉదయం చాలా సేపు నిలిచిపోయింది. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు టికెట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వెబ్సైట్ ఓపెన్ కాలేదు. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఇ-టికెట్ సేవ అందుబాటులో ఉండదని సందేశం చూపించింది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. అని సమాధానం వచ్చింది. ఎవరైనా తన పాత బుక్ చేసిన టిక్కెట్లను రద్దు చేయాలనుకుంటే, కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ను సంప్రదించాలని ప్రదర్శించిన మెసేజ్‌లో పేర్కొన్నారు.