TTD: టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎంకి మంత్రి కొండా సురేఖ లేఖ
- చంద్రబాబు నాయకత్వంలో నిర్ణయం
- భక్తుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిందని వ్యాఖ్య
- ఏపీ సీఎం ఆదేశాలను టీటీడీ సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి కొండా సురేఖ తెలంగాణ దేవాదాయ శాఖ లేఖ రాశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ ఉపయోగపడుతుందని, వారందరి తరపున తాను ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అయితే, తెలంగాణ నుంచి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలుగు ప్రజల తిరుపతి వేంకటేశ్వరుడిపై భక్తి తగ్గలేదని మంత్రి నొక్కి చెప్పారు.
READ MORE: Off The Record: ఆ టీడీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారా..? కారణం ఏమిటి..?
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ఇటీవల ఏపీ సర్కారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తిరుపతి దేవుడి దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వడానికి అనుమతించబడినందుకు తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. అయితే, టీటీడీ అధికారులు గౌరవ ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవడం లేదని చంద్రబాబుకి నివేదించారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, తిరుమల వేంకటేశ్వరుడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి సురేఖ తీసుకెళ్ళారు. ఈ విషయాన్ని వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి, సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తమరి జోక్యం తెలంగాణకు చెందిన చాలా మంది భక్తులలో ఆనందాన్ని నింపుతుందని నివేదించారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి సత్వరమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..