Dhurandhar: ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటించిన ఈ చిత్రం కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ధురంధర్ భారతదేశంలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత.. రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు. అంతేకాదు.. ఈ సినిమా OTT స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ధురంధర్ రెండు భాగాలను రూ.130 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు…
Suryapet: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. గాయపడ్డవారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Alluri Agency: అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టించాయి. చాలా ఏళ్ల తరువాత ఏజెన్సీలో మావోయిస్టు బ్యానర్లు వెళిశాయి. హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి.. ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ కుమ్మిపుట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. "అమరవీరుల హిడ్మాకు జోహార్లు.. ఓ వీరుల నువ్వు కన్న కల దోపిడి లేని స్వేచ్ఛ దేశం నువ్వు పోరాడిన సాయుధ పోరాటం ప్రజల గుండెల్లో చరిత్ర లేఖలాగా ఉంటుంది." అని 1.హెడ్మా. 2.మడకం…
CM Revanth Reddy to Visit Osmania University: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో రెండు సారి ఓయూకి వెళ్లనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకు వెళ్లారు. డిసెంబర్ లో మళ్ళీ వస్తానని అప్పట్లో మాటిచ్చారు. కాగా.. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ది కోసం రూ. 1000 కోట్లు విడుదల చేశారు. సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.
Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతరులు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్…
Top 5 Electric SUVs Coming to India in 2026: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. టాటా వంటి కంపెనీలు ఇప్పటికే పలు ఈవీలు విక్రయిస్తున్నాయి. అలాగే మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కానీ మారుతి వంటి కొన్ని బ్రాండ్లు ఇప్పటికీ పూర్తిగా ఈవీ విభాగంలోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా SUVsకి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కార్ కంపెనీలు భారత మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే.. తాజాగా కంపెనీల వ్యూహాలు మారుతున్నాయి. 2026లో భారత మార్కెట్లో ఐదు ప్రధాన ఎలక్ట్రిక్…
IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష విధించారు! ఇండిగో విమానాలలో 10% సర్వీసులను తగ్గించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పిలిపించారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సవరించిన షెడ్యూల్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమర్పించాలని ఇండిగోను ఆదేశించారు. మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఇండిగో సుమారు 2,200 రోజువారీ విమానాలపై ప్రత్యక్ష ప్రభావం…
Young Hero Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్ అయ్యాడు.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోను మాత్రం సఫర్ అయ్యేలా చేసింది. ఆ హీరో…
Director Sandeep Raj: బాలకృష్ణ అభిమానులకు గుడ్న్యూస్.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ డైరెక్టర్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. నేనే దురదృష్ట వంతుడిని అంటూ సోషల్ […]
Harish Rao: తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంకండి.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విజయ దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడన్నారు. పాలు ఏందో నీళ్లు ఏందో ప్రజలకు అర్థమైంది.. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్…