UPSC Centenary Celebrations: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సమయానికే ఈ వేడుకలను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో యూపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్, సభ్యులు మాత్రమే కాకుండా, అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్లు, సభ్యులు,…
CM Revanth Reddy: తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సఫ్రాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో LEAP ఇంజిన్ ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్ అని చెప్పారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా…
TG Local Body Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు దఫాల్లో ఓటింగ్ జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు. అయితే.. గ్రామ పంచాయతీ మోడల్ కోడ్, స్పష్టమైన నియమాల గురించి తెలుసుకుందాం..
Top Natural Ways to Cleanse & Strengthen Your Liver: కాలేయం మన శరీరంలో అత్యంత శ్రమించే అవయవం. ఆహారం జీర్ణం కావడం నుంచి శరీరంలోకి వచ్చే విషపదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు ఎన్నో పనులను ఇది నిరంతరం చేస్తూనే ఉంటుంది. కానీ మన జీవిత శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ప్రాసెస్డ్ ఆహారం, మద్యం వంటి కారణాలతో ఈ అవయవం పనితీరు నెమ్మదిగా దెబ్బతింటుంది. కాలేయం బలహీనపడితే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది కాబట్టి, దాన్ని సమయానుకూలంగా శుభ్రపరచుకోవడం, దానికి విశ్రాంతి…
Hyderabad: హైదరాబాద్ పోలీస్ శాఖకు మచ్చతెచ్చే విధంగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భాను ప్రకాశ్ ప్రవర్తించిన తీరు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్‌లలో బాగా మునిగిపోయి అప్పుల పాలైన భాను ప్రకాశ్, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకున్నట్టు బయటపడింది. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసిన ఐదు తులాల బంగారాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుని పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాడు. బాధ్యతగా పని చేయాల్సిన స్థానంలో ఉండి నేరాలకు పాల్పడటంతో భాను ప్రకాశ్‌పై పోలీసు శాఖలో తీవ్ర…
Winter Health Tips: చలికాలం మొదలైంది. పగటి వేళ తగ్గిపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు ఒక్కో రోజు మరొక స్థాయికి దిగజారుతాయి. ఈ మార్పులు కేవలం వాతావరణానికే పరిమితం కావు.. మన ఆరోగ్యంపై, రోజువారీ పనితీరుపై కూడా వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చలి ఇచ్చే ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే ఈ సీజన్లో పలు చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాష్ తుపాకీ మిస్స్ అయ్యింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్‌తో బయటకు పంపుతానని అనడంతో గొడవవ సర్దుమణిగింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు.. మేయర్ అంగీకారం తెలిపి.. అందెశ్రీకి నివాళికి చిహ్నంగా జయజయహే తెలంగాణ కూడా…
CRPF Strengthens Security at Telangana–Chhattisgarh Border: తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో భారీగా CRPF భద్రతా బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను భద్రతాబలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్ఫీఎఫ్ 39 బెటాలియన్‌ను సీఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "కర్రెగుట్టలపై అతితక్కువ కాలంలో పట్టు సాధించాం.. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చి దిద్దుతాం.. త్వరలో…
Muskan Saurabh Rajput Case: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిపెట్టిన ముస్కాన్ గుర్తుంది కదా.. ముస్కాన్ మరోసారి ముఖ్యాంశాలలో నిలిచింది. సౌరభ్ హత్యలో ప్రధాన నిందితురాలు ఎనిమిది నెలలుగా జైల్లో ఉంది.. తాజాగా ముస్కాన్ ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజీలో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ వార్త కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నవజాత శిశువుకు తండ్రి ఎవరు? ఆమె…