Guinea-Bissau: ఆఫ్రిక ఖండంలోని మరో దేశంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా-బిస్సావు దేశంలో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ తీసుకున్నట్లు సైనిక అధికారులు ప్రకటించారు. సైన్యం తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి, దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. సరళంగా చెప్పాలంటే.. మరొక ఆఫ్రికన్ దేశం కూలిపోయింది. గినియా-బిస్సావు దేశం చిన్నదైనప్పటికీ రాజకీయంగా అస్థిరం ఆ దేశాన్ని పట్టి పీడించింది.
Haryana Lawyer Arrested for Alleged ISI Links: భారత్లో దేశ ద్రోహులు పుట్టగొడుగుల్ల బయటపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి రహస్య సమాచారం అందించాడనే ఆరోపణలపై హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని పోలీసులు ఒక న్యాయవాదిని అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ సంవత్సరం మేవాట్ ప్రాంతంలో అనుమానిత పాకిస్థానీ గూఢచారులను అరెస్టు చేయడం ఇది మూడవసారి. అరెస్టయిన న్యాయవాదిని నుహ్లోని ఖర్ఖారి గ్రామానికి చెందిన రిజ్వాన్గా గుర్తించారు. అతను గురుగ్రామ్ కోర్టులో…
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
Madapur IT Scam: మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్లో కలకలం రేపుతోంది. స్థానికంగా పేరొందినట్టు నటిస్తూ కార్యకలాపాలు నిర్వహించిన NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం బయటపడింది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి భారీగా డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది.
Jagtial: జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. కుటుంబ కలహాలతో భార్య భర్తలను లేపేసింది. ఈ దిగ్భ్రాంతి కరమైన ఘటన ఇరు కుటుంబాల్లో బాధను మిగిల్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య అతని భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తాజాగా కుటుంబ కలహాలు, వాగ్వాదంతో భార్య కోపం తీవ్రరూపం దాల్చింది. దీంతో మొదట రోకలి బండతో భర్త తలపై దాడి చేసినట్లు సమాచారం.
Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కలకలం సృష్టించింది.. బాబు బాగోతం మామూలుగా లేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లపై శశికాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు.. స్పెషల్ ఆఫీసర్ అంటూ బిల్డర్లతో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు.. పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూళ్లు చేశాడు.. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరింపులకు దిగాడు.. ఈ నిందితుడిపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
Vikarabad: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మతన్ గౌడ్ గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్ ఖరారైంది. గ్రామంలో ST కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. గ్రామంలో 494 మంది ఓటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో వారి ఆనందానికి అవధులే వేరు.. ఎరుకల భీమప్ప, భార్య వెంకటమ్మ గ్రామంలో చీపుర్లు, బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నారు.. […]
India Constitution Day History: నేడు భారత రాజ్యాంగ దినోత్సవం.. దాదాపు 200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని.. స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో మన రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. 1947లో స్వాతంత్రం లభించిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26 నాటి రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి, స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇక, రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని…
Indian Constitution: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్గా విడుదల చేశారు. తెలుగు భాష సహా.. మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయాళంలో రాజ్యాంగాన్ని అనువాదించారు. ఈ రోజు మొత్తం దేశం రాజ్యాంగ నిర్మాతలకు గౌరవం ఇచ్చే రోజు అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
Hyderabad: ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి(26) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమించి మోసం చేసిందనే కారణంతో పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి.. అతడు పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని…