Hyderabad: దువ్వాడ మాధురి, శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్థసారథి అనే వ్యక్తి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించారు. అతడి పుట్టినరోజు సందర్భంగా రాత్రి The pendent ఫామ్ హౌస్లో పార్టీ ఎరేంజ్ వేశాడు. ఈ పార్టీ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ & మాధురిలను పార్థసారథి ఆహ్వానించారు. మొయినాబాద్ లోని The Pendent ఫామ్ హౌస్ లో బర్దీప్ డే పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు.
Panchayat Polls: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 2,383 బీఆర్ఎస్ 1,146, బీజేపీ 181, ఇతరులు-455 సీట్లను కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైంది.
Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందిగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది! మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది.
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు.. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠానా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందారు.. కానీ.. చెర్ల మురళి ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు.. మొత్తం 1717 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ చెర్ల మురళి 739, బీజేపీ సురువు వెంకటి 369, కాంగ్రెస్ కోలాపురి…
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కర్నూలు బస్సు దగ్ధం తరహాలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. శిరివెళ్ళ మెట్ట సమీపంలోని నేషనల్ హైవేపై టీవీ ఎస్ 50 ఎక్సెల్ ను శ్రీవారి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టింది.. హైదరాబాద్ నుంచి తిరుచ్చికి 18 మందితో ప్రయాణిస్తున్న శ్రీవారి ట్రావెల్స్ బస్సు.. టీవీఎస్ను ఒక్కసారిగా ఢీకొంది. ఢీకొట్టిన తర్వాత బస్సు కింద ఇరుక్కుపోయింది టీవీఎస్ 50.. బస్సు ఆ బైక్ను వంద మీటర్లు […]
Local Body Elections: తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 గ్రామపంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది.
Hyderabad Cybercrime: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ శాఖ ప్రజలను క్రెడిట్ కార్డ్ మోసాల పెరుగుతున్న ప్రమాదం గురించి హెచ్చరిస్తోంది. మోసగాళ్లు ఫిషింగ్, నకిలీ మర్చెంట్ వెబ్సైట్లు, UPI/QR కోడ్ స్కాములు, రివార్డ్ పాయింట్ స్కాములు, క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఆఫర్లు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, మొబైల్ యాప్ మాల్వేర్ ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
TGSEB: ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి! తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ లో పొందు పర్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB) ఏర్పాటు చేయనుంది. గ్రేడ్స్ I నుంచి XII వరకు అన్ని తరగతులను పర్యవేక్షించే ఒకే సంస్థగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB).. ఈ బోర్డు ద్వారా అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ స్థాయుల్లో పాఠ్య ప్రణాళిక (Curriculum), మదింపు (Assessment)లో…
Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.. పోలింగ్ కేంద్రం ఆవరణలో మధ్యాహ్నం 1 గంటలోపు ఉన్న వారికి టోకెన్లు జారీ చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బ్యాక్స్ లను సీల్ చేశారు.. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు చేపడతారు.. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు…