Realme 14T 5G: రియల్మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్మీ 14T 5G ను ఏప్రిల్ 25న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ 14 సిరీస్ లో భాగంగా విడుదలవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ పలు విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. లాంచ్ 14T 5G ఫోన్ ప్రధాన ఆకర్షణగాv 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్ప్లే నిలుస్తుంది. ఇది గరిష్ఠంగా 2100 నిట్స్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. […]
Mulugu: ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాన్ని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 08:30 గంటలకు మంత్రులు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 09:15 గంటలకు ములుగు జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద హెలిపాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి […]
Contract Lecturers: తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌ను ముట్టడించారు. మొత్తం 12 విశ్వవిద్యాలయాల్లో సుమారు 1,400 మంది కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ సామర్ల విజయేందర్ రెడ్డి నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ […]
Tenali Double Horse: తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌కు మరో గౌరవం దక్కింది. యుఆర్ఎస్ మీడియా, ఆసియావన్ మ్యాగజైన్ సమర్పణలో జరిగిన ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం 25వ ఎడిషన్‌లో 2024–25 సంవత్సరానికి గానూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో ఒకటిగా తెనాలి డబుల్ హార్స్‌ను గుర్తించారు. ఈ అవార్డును పొందామని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సంతోషంగా వెల్లడించింది. ఈ అవార్డు సంస్థకు తన కస్టమర్ల, భాగస్వాముల, బృంద సభ్యుల నమ్మకం, […]
TPCC Protest: హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కుల గణన అజెండా […]
Hyderabad Metro: 2017లో ప్రారంభమమైన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ప్రాజెక్టుగా నిలిచింది. ఈ మెట్రో సేవలు నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. అధిక రహదారి ట్రాఫిక్, కాలుష్య సమస్యల నేపథ్యంలో మెట్రో సేవలు నగర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ.6,500 కోట్లకు […]
Today Gold Rates: నేడు మరోమారు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గడిచిన రెండు రోజులలో తులానికి రూ.2,000ల పెరుగుదల నమోదైంది. ఇక నేడు మన తెలుగు రాష్ట్రలలో నిన్నటి ధర కంటే రూ.1,140 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.89,200గా ట్రేడ్ అవుతుంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. నిన్నటి ధరపై రూ.860 పెరిగి […]
KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. కంచన్‌బాగ్ – గచ్చిబౌలి మధ్య 400 ఎకరాల భూముల వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వారికి తావు లేదని అన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరుడికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది’ […]
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ గుండె వైద్యుడు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదును ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అనుమతులు కార్డియాక్ డాక్టర్ పేరుతో తీసుకున్నప్పటికీ, వైద్య సేవలు మాత్రం కేవలం ఎంబిబిఎస్ అర్హత కలిగిన డాక్టర్ నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గుండె సంబంధిత వైద్య సేవల పర్యవేక్షణలో అనుభవం లేకపోయిన డాక్టర్, గుండె సంబంధిత […]
Crime News: మేడ్చల్ జిల్లా అంకుశాపూర్‌లో ఆస్తి గొడవలో బావ కుట్ర బయట పడింది. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చినట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ, 2020లో శ్రీనివాస్–లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనలు పెట్టారు. […]