ED Raids: హైదరాబాద్ నగరంలో రెండవ రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్దఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రాథమిక విచారణలో నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ […]
CM Revanth Japan Tour: ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు గల అత్యంత ముఖ్యమైన మార్గంగా విదేశీ పర్యటనలను చేస్తుండడం మరింత జోరుగా మారింది. రాష్ట్రాలకి విదేశీ పెట్టుబడులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటిస్తూ అక్కడి పరిశ్రమలతో, పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్ పర్యటన చేపట్టింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా […]
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన […]
Bhu Bharathi: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు, నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామస్థాయిలో […]
Smita Sabharwal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్‌కి రాష్ట్ర పోలీసుల నుంచి నోటీసు అందింది. దీనికి కారణం స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమాల్లో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన చిత్రం షేర్ చేయడమే. ఈ చిత్రం మార్చి 31న ‘Hi Hyderabad’ అనే X సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ […]
KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి హృదయపూర్వకంగా స్వాగతం తెలిపింది. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొనింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయమని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం అంటూ పేర్కొన్నారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం […]
Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కృష్ణా నదీ జలాల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనాన్ని తీవ్రంగా విమర్శించారు. గత రెండు నెలలుగా తమ పార్టీ చెబుతోన్న వాదనల్ని ఇప్పుడు కృష్ణా బోర్డు కూడా సమర్థించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అక్రమంగా 65 టీఎంసీల నీటిని తీసుకెళ్లిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లను అక్రమంగా తరలిస్తుందన్న విషయం మేము […]
Gold Rates: బంగారం, వెండి ధరలు మరోమారు భారీ షాకిచ్చాయి. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకి చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే, నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న రూ.95,180 ఉండగా నేడు రూ.990 ఎగబాకి రూ. 96,170 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల […]
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేడు (బుధవారం) జరుగుతున్న విచారణ సందర్భంగా.. “చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు” అంటూ జస్టిస్ బి. ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. అయితే, ఈ విచారణలో.. నాశనం చేసిన వందల ఎకరాల అడవులను మీరు ఎలా పునరుద్ధరిస్తారు? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పర్యావరణ […]
HONOR Power: హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇక ఈ ఫోన్లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. అంతేకాక 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్ లో Snapdragon 7 […]